Pakistan on Raja Singh's remarks
Pakistan on Raja Singh’s remarks: హైదరాబాద్ లోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై భారత్ లోనే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రాజాసింగ్ వ్యాఖ్యలపై పాకిస్థాన్ కూడా స్పందించింది. అటువంటి వ్యాఖ్యల కారణంగా పాకిస్థాన్ సహా ప్రపంచంలోని కోట్లాది మంది ముస్లింల మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొంది.
రాజాసింగ్ వ్యాఖ్యలపై నిరసన తెలుపుతున్నట్లు పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం చెప్పింది. బీజేపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయకుండా చూసుకోవాలని భారత ప్రభుత్వాన్ని పాక్ డిమాండ్ చేసింది. ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేయవద్దని ఓ ప్రకటనలో పేర్కొంది. మూడు నెలల వ్యవధిలో బీజేపీ నేతలు రెండవ సారి ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని చెప్పింది.
రాజాసింగ్‌పై బీజేపీ తీసుకున్న చర్యలు సరిపోవని పాక్ పేర్కొంది. కొన్ని గంటల వ్యవధిలోనే ఆయనను బెయిల్‌పై విడుదల చేయడం ఏంటని ప్రశ్నించింది. కాగా, ఇంతకు ముందు నుపుర్ శర్మ (బీజేపీ బహిష్కృత నాయకురాలు) కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ప్రపంచంలోని పలు దేశాలు మండిపడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్నే పాక్ గుర్తు చేసింది.
Nitish Kumar: 2020లో తక్కువ సీట్లు గెలిచినా నేను సీఎం ఎందుకు అయ్యానో తెలుసా..? వెల్లడించిన నితీశ్