Pakistan cop gets ₹100 million
Pak Cop Gets ₹100 Million In Bank Account : పాకిస్తాన్‌లో ఓ పోలీసు అధికారి రాత్రికి రాత్రే లక్షాధికారి అయ్యాడు. పోలీసు అధికారి బ్యాంక్ ఖాతాలో తనకు తెలియకుండా 100 మిలియన్ రూపాయలు జమ అయ్యాయి. కరాచీలోని బహదూరాబాద్ పోలీస్ స్టేషన్‌లోని విచారణ అధికారి జీతంతో సహా 100 మిలియన్ రూపాయలు తన బ్యాంక్ ఖాతాలో జమ కావడంతో షాక్ అయ్యాడు. తన ఖాతాలో కొన్ని వేల రూపాయల కంటే ఎక్కువ డబ్బును ఎప్పుడూ లేవని.. ఒక్కసారిగా ఇంత డబ్బును చూసి ఆశ్చర్యపోయానని పోలీసు అధికారి అమీర్ గోపాంగ్ తెలిపారు.
తన ఖాతాకు 100 మిలియన్ రూపాయలు బదిలీ అయ్యాయని బ్యాంక్ తెలియజేసినప్పుడు మాత్రమే తనకు తెలిసిందని చెప్పాడు. విచారణ జరుపుతున్నందున తన బ్యాంకు ఖాతాను నిలిపివేయడంతోపాటు ఏటీఎం కార్డును కూడా బ్యాంకు బ్లాక్ చేసిందని ఆయన చెప్పారు. గతంలో లార్కానా, సుక్కూర్‌లలో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి.
HDFC Accounts : డబ్బే డబ్బు… వారి బ్యాంకు ఖాతాల్లోకి రూ.13.5 కోట్లు జమ.. అసలేం జరిగిందంటే..
ఇతర పోలీసు అధికారుల బ్యాంకు ఖాతాలలో వారికి తెలియకుండా పెద్ద మొత్తంలో డబ్బు జమ అయింది. లర్కానాలో ముగ్గురు పోలీసు అధికారుల బ్యాంకు ఖాతాల్లో పెద్ద మొత్తంలో డబ్బు జమ అయింది. ఒక్కొక్కరి ఖాతాల్లో 50 మిలియన్ రూపాయలు జమ అయ్యాయి.
అలాగే సుక్కూర్‌లో ఒక పోలీసు అధికారి ఖాతాలో కూడా అంతే మొత్తంలో డబ్బు జమ అయింది. తమ ఖాతాల్లోకి పెద్ద మొత్తంలో డబ్బు ఎలా వచ్చిందో తెలియదని ముగ్గురు పోలీసు అధికారులు చెప్పారు. ఈ విషయంపై లర్కానా పోలీసు ప్రతినిధిని అడగ్గా విచారణలో ఉందన్నారు.