HDFC Accounts : డబ్బే డబ్బు… వారి బ్యాంకు ఖాతాల్లోకి రూ.13.5 కోట్లు జమ.. అసలేం జరిగిందంటే..

ఆ బ్యాంకు కస్టమర్లు నక్క తోక తొక్కినట్లు ఉన్నారు. కాకపోతే మరేంటి. వారి ఖాతాల్లోకి పెద్ద మొత్తంలో డబ్బు పడింది. కొందరికి పది వేలు పడితే, మరికొందరికి రూ.50లక్షలు పడింది. ఇక చూసుకోండి వారి ఆనందానికి అవధులే లేవు. అసలేం జరిగిందంటే..

HDFC Accounts : డబ్బే డబ్బు… వారి బ్యాంకు ఖాతాల్లోకి రూ.13.5 కోట్లు జమ.. అసలేం జరిగిందంటే..

Hdfc Accounts

HDFC Accounts : మీకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అకౌంట్ ఉందా? అయితే బ్యాలెన్స్ ఎంతుందో ఓసారి చెక్ చేసుకోండి. మీ అకౌంట్ లో ఏమైనా డబ్బులు పడ్డాయేమో క్రాస్ చెక్ చేసుకోండి. డబ్బులు పడలేదా? అయితే, మీ బ్యాడ్ లక్.

ఎందుకంటే.. చెన్నైలో మాత్రం ఓ వందమంది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కస్టమర్లు నక్క తోక తొక్కినట్లు ఉన్నారు. వారి ఖాతాల్లోకి రూ.10వేల నుంచి రూ.50లక్షల వరకు నగదు క్రెడిట్ అయ్యింది. వారి ప్రమేయం లేకుండానే, అడక్కుండానే పెద్ద మొత్తంలో డబ్బు పడింది. అకౌంట్ లో డబ్బు పడినట్లుగా మొబైల్‌కి మేసేజ్ రావడం ఆలస్యం.. డబ్బు పడిన వారంతా షాక్‌కి గురయ్యారు. అసలు డబ్బు ఎలా జమ అయ్యందో తెలియక కన్ ఫ్యూజన్ చెందారు.

క్రెడిట్ కార్డు బిల్లులు కట్టలేదా? : బ్యాంకులు వదలవు.. మీ అకౌంట్లో గీకేస్తాయి.. జాగ్రత్త!

ఇది నిజమేనా అని క్రాస్ చెక్ చేసుకున్నారు. కొందరు ఏటీఎంకు వెళ్లి చూసుకున్నారు. మరికొందరు ఆన్‌లైన్‌లో ట్రాన్సాక్షన్లు చెక్ చేసుకున్నారు. అక్షరాల ఉన్న బ్యాలెన్స్ చూసుకుని ఆనందంతో గంతులేశారు. చెన్నైలోని బర్కిట్ రోడ్ లోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఇది జరిగింది.

ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వంది మంది అకౌంట్లలోకి మొత్తంగా రూ.13.5 కోట్లు క్రెడిట్ అయ్యాయి. ఈ విషయం తెలిసిన బ్యాంకు సిబ్బంది నాలుక కరుచుకున్నారు. బ్యాంకు సర్వర్లలో కొత్త సాఫ్ట్ వేర్ ఇన్ స్టాల్ చేయడమే ఈ గందరగోళానికి కారణమైందని గుర్తించారు. వందమంది ఖాతాల్లోకి ఏకంగా రూ.13.5 కోట్లు పొరపాటున పడినట్లు నిర్ధారించారు.

హెచ్‌డిఎఫ్‌సీ క్రెడిట్ కార్డులు ఇక రావు: ఆర్‌బీఐ కీలక ఆదేశాలు

వారి అకౌంట్లను తాత్కాలికంగా సస్పెండ్ చేశారు బ్యాంకు సిబ్బంది. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కొందరు కస్టమర్లు డబ్బు డ్రా చేసేశారు. కస్టమర్ పేజ్ లో డిటైల్స్ అప్ డేట్ చేసినప్పుడు క్రెడిట్ పేజీలో గందరగోళం జరిగినట్లు బ్యాంకు సిబ్బంది అనుమానిస్తున్నారు. మరోవైపు ఈ విషయంపై ఫెడరల్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది.