Pakistan floods : పాక్‌లో మతసామరస్యం .. వరదల నుంచి కాపాడి వందలాది ముస్లింలకు హిందూ దేవాలయంలో ఆశ్రయం

పాకిస్థాన్ వరదలు ముంచెత్తున్న వేళ ఇస్లామిక్ దేశంలో మతసామరస్యం వెల్లివిరిసింది. వరదల్లో చిక్కుకున్న వందలాదిమందికి ఓ హిందూ దేవాలయం ఆశ్రయం కల్పిస్తోంది. బాధితులకు ఆహారం అందిస్తోంది.

Pakistan floods : పాకిస్థాన్‌ని వరదలు అతలాకుతం చేశాయి. 1000మందికి పైగా ప్రాణాలు కోల్పోగా లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. తినటానికి తిండి లేదు..తాగటానికి నీరు లేదు. ఆకలితో అలమటించిపోతున్నారు. చిన్నపిల్లల కడుపులు కూడా నింపలేక తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. వరదలతో ప్రజలు తీవ్ర కష్టాలు పడుతున్నారు. లక్షలాది మంది నిలువనీడ లేకుండా సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

ఇటువంటి విపత్కరపరిస్థితుల్లో కచ్చి జిల్లాలోని జలాల్‌ ఖాన్‌ గ్రామం పాకిస్థాన్ లో మతసామరస్యానికి వేదిక అయ్యింది. జలాల్‌ ఖాన్‌ గ్రామ ప్రజలు మాత్రం సురక్షితంగా ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న బాబా మధోదాస్‌ హిందూ దేవాలయం వారికి ఆశ్రయం కల్పించింది. దేవాలయం నిర్వాహకులు 200ల నుంచి 300 మంది ముస్లింకు ఆశ్రయం కల్పించారు. అంతేకాదు వారికి ఆకలి అంటే ఏంటో తెలియకుండా వారికి ఆహారం కూడా అందిస్తున్నారు.

జలాల్ ఖాన్ గ్రామంలోని ఎత్తైన ప్రదేశంలో ఉన్న బాబా మధోదాస్ మందిర్ వరద నీటి నుండి సురక్షితంగా ఉంది. దీంతో వరద బాధితులకు సహాయకారిగా మారింది. కుల మతాల తేడా లేకండా వందలాదిమంది ముస్లింలకు ఆశ్రయం కల్పించి ఆహారం పెడుతున్నారు బాబా మధోదాస్ మందిర్ నిర్వాహకులు. జలాల్ ఖాన్ గ్రామంలోని ఎత్తైన ప్రదేశంలో ఉన్న బాబా మధోదాస్ మందిర్ వరద నీటి నుండి సాపేక్షంగా సురక్షితంగా ఉంది

భారీ వర్షాలకు నారీ, బోలన్, లెహ్రీ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద నీరు గ్రామాల్లోకి వచ్చి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో స్థానిక హిందూవులు వరద బాధితులకు సహాయం సహకారాలు అందిస్తున్నారు. బాబా మధోధాస్ మందిరి తలుపులు బాధితులకు తెరిచి ఉంటాయని బాధితులు ఎవ్వరైనా సరే ఇక్కడకు వచ్చి ఆశ్రయం పొందవచ్చని కోరుతున్నారు మందిర్ నిర్వాహకులు.

 

ట్రెండింగ్ వార్తలు