Isi
Pakiastan’ ISI’ పాకిస్తాన్ మిలటరీ బుధవారం అనూహ్య నిర్ణయం తీసుకుంది. పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ(Inter-Services Intelligence)చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్‌ను పెషావర్ కార్ప్స్ కమాండర్‌గా బదిలీ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. పొరుగున ఉన్న అప్ఘానిస్తాన్ ని తాలిబాన్ స్వాధీనం చేసుకున్న దృష్ట్యా ఇది కీలక పరిణామం.
పాకిస్తాన్ సైన్యంలో ISI చీఫ్ పోస్ట్ చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. దేశ భద్రత మరియు విదేశాంగ విధానంలో గణనీయమైన శక్తిని కలిగి ఉంటుంది. ఐఎస్‌ఐ చీఫ్‌ని ప్రధాని నియమిస్తారు. కానీ సంప్రదాయంలో భాగంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌ని సంప్రదించి ప్రధాని ఈ అధికారాన్ని అమలు చేస్తాడు. 2019 జూన్ 16 న గూఢచార సంస్థ అధిపతిగా హమీద్ నియమితులయ్యాడు. అతను గతంలో అంతర్గత భద్రతా అధిపతిగా పనిచేశాడు. అతను ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ బజ్వాకు దగ్గరి వ్యక్తిగా పరిగణలో ఉన్నాడు. దేశం లోపల,బయట అనేక భద్రతా సవాళ్ల మధ్య కీలకమైన సమయంలో ఐఎస్‌ఐ అధిపతిగా నియమితులయ్యాడు. ఇటీవల అప్ఘానిస్తాన్ లో కీలక మార్పులను ఫయాజ్ హమీద్ భౌతికంగా పర్యవేక్షించాడు. సెప్టెంబరులో కాబూల్‌ను సందర్శించి ఫైజ్ హమీద్ తాలిబన్లు,హక్కానీలతో కీలక చర్చలు జరిపాడు.
ఇక,ఫైజ్ హమీద్ స్థానంలో లెఫ్టినెంట్ జనరల్ నదీమ్ అంజుమ్ కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) గా నియమించబడ్డారని పాక్ మీడియా యొక్క మీడియా విభాగం-ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR)బుధవారం తెలిపింది. కాగా, మరో రెండు సీనియర్ స్థాయి పోస్టింగ్‌లను కూడా పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించింది. లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ అమీర్‌ను గుజ్రాన్ వాలా కార్ప్స్ కమాండర్‌గా, లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్‌ను ఆర్మీ క్వార్టర్ మాస్టర్ జనరల్ గా నియమించింది.
ALSO READ Pragya Jaiswal: ప్రగ్యా గ్లామర్ ట్రీట్.. కంచె దాటేస్తుందా!