Pakistan University : పాక్ యూనివర్శిటీలో విద్యార్థినులపై లైంగిక వేధింపులు…వెలుగుచూసిన షాకింగ్ వీడియోలు
పాకిస్థాన్ ఇస్లామియా యూనివర్శిటీలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. వర్శిటీలో మహిళా విద్యార్థినులు మాదకద్రవ్యాలు తీసుకోవడం, లైంగిక వేధింపులకు గురైనట్లు చిత్రీకరించిన 5,500 వీడియోలు తాజాగా వెలుగుచూశాయి. విద్యాబుద్ధులు చెప్పాల్సిన యూనివర్శిటీలోనే లైంగిక వేధింపుల బాగోతం వెలుగుచూడటం పాకిస్థాన్ దేశంలో సంచలనం రేపింది....
- saleem sk
- Published On : July 29, 2023 / 01:00 AM IST
Pakistan Islamia University big Scandal
Pakistan Islamia University : పాకిస్థాన్ ఇస్లామియా యూనివర్శిటీలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. వర్శిటీలో మహిళా విద్యార్థినులు మాదకద్రవ్యాలు తీసుకోవడం, లైంగిక వేధింపులకు గురైనట్లు చిత్రీకరించిన 5,500 వీడియోలు తాజాగా వెలుగుచూశాయి. విద్యాబుద్ధులు చెప్పాల్సిన యూనివర్శిటీలోనే లైంగిక వేధింపుల బాగోతం వెలుగుచూడటం పాకిస్థాన్ దేశంలో సంచలనం రేపింది. (Pakistan Islamia University big Scandal)
CM KCR – Bhim Army : భీం ఆర్మీ మహాసభలకు సీఎం కేసీఆర్ కు ఆహ్వానం
ఇస్లామియా యూనివర్శిటీ బహవల్‌పూర్ సెక్స్ స్కాండల్ కేంద్రంగా మారింది. మహిళా విద్యార్థినులు మాదకద్రవ్యాలు తీసుకోవడం, లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు చిత్రీకరించే వేలాది స్పష్టమైన వీడియోలను వర్సిటీ సిబ్బంది నుంచి స్వాధీనం చేసుకున్నారు. దీంతో ప్రతిష్టపై చీకటి మబ్బులు కమ్ముకున్నాయి. ఈ లైంగిక వేధింపుల బాగోతంలో పాక్ ఫెడరల్ మంత్రి చౌదరి తారిఖ్ బషీర్ చీమా కుమారుడు, పాక్ ఆర్మీ మేజర్ ఇజాజ్ షాల హస్తం ఉందని తేలడం దిగ్భ్రాంతి కలిగించింది.
మేజర్ ఇజాజ్ షాను అరెస్టు చేయడంతో అతని వద్ద కామోద్దీపన మాత్రలు, మాదకద్రవ్యాలు, అభ్యంతరకరమైన వీడియోలు లభించాయి. వర్శిటీ విద్యార్థినులపై అత్యాచారం చేసిన ఘటనలను కూడా చిత్రీకరించారని వెల్లడైంది. దీంతో బహవల్ పూర్ ఇస్లామియా యూనివర్శిటీ లైంగిక దోపిడీ పర్వంపై దర్యాప్తు చేసేందుకు ఐదుగురు పాక్ పోలీసుల బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ వర్శిటీలో జరిగిన చీకటి బాగోతాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
