Pakistan Floods : మెడలోతు నీటిలో దిగి వరదలపై రిపోర్టింగ్‌ ..

పీకలోతు నీళ్లలోకి దిగి వరదలపై రిపోర్టింగ్ చేశాడు ఓ జర్నలిస్టు.

Pakistan Floods :  రిలవెంట్ రిపోర్టింగ్ అనేది రివాజుగా మారిపోయింది ఈరోజుల్లో. ఫీల్డ్ రిపోర్టింగ్ తో పిచ్చెక్కించేస్తున్నారు రిపోర్టర్లు. ఇది ఆ ఘటన జరిగిన ప్రదేశం ఇదే..ఇక్కడే ఆ హంతకుడు ఇలా చేశాడు…అలా చేసాడు అంటూ ఎక్సైట్ మెంట్ తో రిపోర్టింగ్ లు ఎన్నో చూశాం. నిజానికి ఇవన్నీ చూడటానికి కాస్త ఓవర్ అని చూసేవాళ్లు అనుకున్నా రిపోర్టింగ్ అంటే మాటలు కాదు. అది అంత ఈజీ కాదు. న్యూస్‌ లైవ్‌ రిపోర్టింగ్‌ అంతకంటే ఈజీ కాదు. ముఖ్యంగా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు రిపోర్టింగ్‌ చేయడం అంటే కత్తిమీద సామే అని చెప్పవచ్చు.

అటువంటిదే పాకిస్థాన్ లో వరదల్లో జరిగింది. పీకలోతు నీళ్లలోకి దిగి వరదలపై రిపోర్టింగ్ చేశాడు ఓ జర్నలిస్టు. రిపోర్టింగ్ చేసే క్రమంలో పాత్రికేయులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఒక్కోసారి ప్రాణాలకు తెగించి ముందుకు వెళ్లాల్సి వస్తుంది. వార్తల‌ను ఉన్నది ఉన్నట్టు చూపించేందుకు ఎంతదూరమైనా వెళ్తారు రిపోర్టర్లు. దీనికి నిలువెత్తు ఉదాహరణగా వైలర్ అవుతోంది ఓ వీడియో. పాకిస్థాన్ లో వరదలు బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. పాకిస్తానీ జ‌ర్నలిస్ట్ మెడ‌లోతు నీటిలో వ‌ర‌ద‌ల‌ను క‌వ‌రేజ్ చేస్తున్న వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. వరదనీటిలో కొట్టుకునిపోకుండా సదరు రిపోర్టర్ ఓ చేత్తో రాయిని గట్టిగా పట్టుకుని మరో చేస్తో మైక్ పట్టుకుని రిపోర్టు చేస్తున్నాడు.