Ribbon Cutting : నోటితో రిబ్బన్ కత్తిరించిన మంత్రి

మొండి కత్తెరతో రిబ్బన్ కత్తిరించేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్ మంత్రికి చేదు అనుభవం ఎదురైంది. కత్తెర తెగకపోవడంతో చివరకు నోటితో రిబ్బన్ కట్ చేశాడు.

Ribbon Cutting

Ribbon Cutting : పాకిస్తాన్ కి సంబందించిన చాలా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని ఫన్నీ వీడియోస్ ఉంటే, మరికొన్ని విచిత్రమైనవి ఉంటాయి. అయితే ప్రస్తుతం ఫన్నీ, విచిత్రం కలగలిసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో పాకిస్థాన్ మంత్రి ఫయాజ్ ఉల్ హసన్ చౌహాన్ కు సంబంధించింది.

ఫయాజ్ ఉల్ హసన్ చౌహాన్ ఎలక్ట్రానిక్స్ దుకాణాన్ని ప్రారంభించడానికి లాహోర్ వెళ్లాడు. ప్రారంభోత్సవం కోసం దుకాణ యజమాని రిబ్బన్ కట్టారు. రిబ్బన్ కట్టారు కానీ.. దానిని కట్ చేసేందుకు పదునైన కత్తెర పెట్టలేదు. మొండి కత్తెర మంత్రి చేతిలో పెడితే దానితో ఎంత కట్ చేసినా ఆ రిబ్బన్ తెగలేదు. దీంతో చిర్రెత్తిన మంత్రి నోటితోనే రిబ్బన్ కట్ చేశాడు. అనంతరం షాపు యజమానికి నాలుగు చివాట్లు పెట్టారు.