Pakistan PM Covid-19 : చైనీస్ వ్యాక్సిన్ తీసుకున్న పాక్‌ ప్రధాని‌కి మళ్లీ కరోనా

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు మరోసారి కరోనావైరస్ సోకింది. చైనీస్ వ్యాక్సిన్ తొలి డోస్ వేయించుకున్న రెండు రోజుల తర్వాత ఇమ్రాన్‌కు మళ్లీ కరోనా సోకింది. చైనాకు సంబంధించిన వ్యాక్సిన్‌ ‘సినోవక్‌’ వ్యాక్సిన్‌ తొలి డోసు ఇమ్రాన్‌ తీసుకున్నారు.

Pakistan PM to Covid-19 : పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు మరోసారి కరోనావైరస్ సోకింది. చైనీస్ వ్యాక్సిన్ తొలి డోస్ వేయించుకున్న రెండు రోజుల తర్వాత ఇమ్రాన్‌కు మళ్లీ కరోనా సోకింది. రెండోసారి కరోనా సోకడంతో ప్రధాని ఇమ్రాన్ ఇంట్లోనే హోం ఐసోలేషన్ లో ఉన్నారని ఆయన స్పెషల్ అసిస్టెంట్, నేషనల్ హెల్త్ సర్వీసు ఫైజల్ సుల్తాన్ వెల్లడించారు. ప్రధానికి మరోసారి కరోనా సోకడంపై పాకిస్తాన్‌లో కలకలం రేపింది. కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న రెండు రోజులకే ఆయనకు పాజిటివ్‌ రేపడం ఆందోళన రేకిత్తిస్తోంది.


చైనాకు సంబంధించిన వ్యాక్సిన్‌ ‘సినోవక్‌’ వ్యాక్సిన్‌ తొలి డోసు ఇమ్రాన్‌ తీసుకున్నారు. ప్రజలందరూ కూడా వ్యాక్సిన్‌ తీసుకోవాలని సూచించారు. పీఎం కార్యాలయం కూడా అధికారికంగా వెల్లడించింది. మరోవైపు పాక్ నేషనల్ హెల్త్ సర్వీసెస్ మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం.. ఇమ్రాన్ ఖాన్ వైరస్ సోకిన సమయానికి ఆయన పూర్తిగా వ్యాక్సిన్ తీసుకోలేదని వెల్లడించింది. కరోనాపై వ్యాక్సిన్లు సమర్థవంతంగా పనిచేస్తున్నాయిని మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది.

కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ రెండు రోజుల క్రితమే వేయించుకున్నారని, ఒక వ్యాక్సిన్ ప్రభావంతంగా పనిచేయాలంటే మరికొంత సమయం పడుతుందని పేర్కొంది. సాధారణంగా ఒక వ్యాక్సిన్ తీసుకున్నాక యాంటీబాడీలు తయారుకావాలంటే రెండో డోస్ తీసుకున్న తర్వాత రెండు నుంచి మూడు వారాలు సమయం పడుతుందని వివరణ ఇచ్చింది. ఇమ్రాన్ ఖాన్ కు మళ్లీ కరోనా సోకినప్పటికీ ఆయనలో స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని, ఆయన ఇంటి దగ్గర నుంచే పనిచేస్తున్నారని పీఎం కార్యాలయం పేర్కొంది.


పాకిస్తాన్‌ ప్రధానికి మళ్లీ కరోనా పాజిటివ్‌ రావడంపై సోషల్‌ మీడియాలో ఫన్నీగా కామెంట్లు ట్రోల్ అవుతున్నాయి. చైనా వస్తువుల్లాగే వ్యాక్సిన్‌ కూడా నాసిరకమేనా అంటూ ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజన్లు..

ట్రెండింగ్ వార్తలు