Pakistan-China: చైనా ప్రభావం అధికంగా పడుతున్న 82 దేశాల జాబితాలో పాకిస్థాన్ అగ్రస్థానంలో ఉందని రేడియో ఫ్రీ యూరోప్/రేడియో లిబర్టీ తెలిపింది. తైవాన్ కేంద్రంగా పనిచేసే డబుల్ థింక్ ల్యాబ్ పరిశోధనలో ఈ విషయం తేలినట్లు వివరించింది. పాక్ విదేశాంగ విధానం, దేశీయ పాలసీలు, సాంకేతికత వంటి అంశాల వల్ల చైనా ప్రభావానికి అధికంగా గురవుతోందని చెప్పింది. పాక్ తర్వాత చైనా ప్రభావానికి గురవుతున్న దేశాల జాబితాలో రెండో స్థానంలో కంబోడియా, సింగపూర్ ఉన్నాయి.
మూడో స్థానంలో థాయిలాండ్ ఉంది. దక్షిణాఫ్రికా, పెరూ ఐదో స్థానంలో, ఫిలిప్పీన్స్ ఏడో స్థానంలో, కిర్గిస్థాన్ ఎనిమిదో స్థానంలో, తజకిస్థాన్ తొమ్మిదో స్థానంలో, మలేషియా 10వ స్థానంలో ఉన్నాయి. యూరప్ లో చైనా ప్రభావం అధికంగా ఉన్న దేశంగా జర్మనీ ఉంది. ఆ దేశం 19వ స్థానంలో కొనసాగుతోంది. అమెరికా 21 స్థానంలో ఉంది.
ఉన్నత విద్య, రాజకీయాలు, ఆర్థిక బంధం, విదేశాంగ విధానం, మిలిటరీ సహకారం, మీడియా, సాంకేతికత, సాంస్కృతిక సంబంధాలు వంటి వాటిని పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకులు ప్రకటించారు. చైనా ప్రభావానికి గురికావడానికి ఏయే అంశాలు దోహదం చేస్తున్నాయన్న విషయంపై అవగాహన పొందడానికి తమ నివేదిక ఉపయోగపడుతుందని పరిశోధకులు చెప్పారు. పాకిస్థాన్ లోని ప్రతి రంగంలో చైనా ప్రభావం ఉందని తెలిపారు. ప్రత్యేకంగా మిలటరీ, సాకేంతికత, విదేశాంగ విధానంలో ఆ ప్రభావం ఉందని చెప్పారు.
Viral Video: ఇదెక్కడి చోద్యం?.. ఖాళీ పాత్రలను రెండు చేతులతో పట్టుకుని కొడుతూ పెళ్లిలో డ్యాన్స్