పెట్రోల్ ధరలను మరోసారి భారీగా పెంచిన పాకిస్థాన్.. లీటర్ ధర ఎంతుందో తెలుసా?

Pakistan: ఇప్పటికే నిత్యావసర ధరల పెరుగుదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ ప్రజలు..

ఆర్థిక సంక్షోభం ఊబిలో కూరుకుపోతున్న పాకిస్థాన్‌లో పెట్రోలు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికే ఊహించని విధంగా పెట్రోల్ ధరలు పెరిగాయి. ఇప్పుడు మరోసారి ధరలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏకంగా లీటరుకు రూ.10 (పాకిస్థాన్ రూపాయి) పెంచనున్నట్లు ప్రకటించింది.

అంతర్జాతీయంగా ముడిచమురు ధరల పెరుగుదల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది. పెంచుతున్న ధరలతో పాక్ లో లీటరు పెట్రోలు ధర రూ.289.69కి చేరనుంది. ఇప్పటికే నిత్యావసర ధరల పెరుగుదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ ప్రజలు పెట్రోలు ధరలు అమాంతం పెరిగిపోతుండడంతో దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు.

ఇక డీజిల్ ధరలపై రూ.1.30 తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రస్తుతం 285.86 పాకిస్థాన్ రూపాయలు ఉన్న లీటర్ డీజిల్ ధర రూ.284.26కి చేరనుంది. కిరోసిన్ ధర లీటరుకు రూ.188.66 నుంచి రూ.188.49కు తగ్గింది. అంటే లీటరుకు రూ.0.17 తగ్గుదల నమోదైంది.

అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్థాన్ కు దాని నుంచి బయటపడే పరిస్థితులు కనపడడం లేదు. దీంతో పాక్ సర్కారు ధరలను పెంచుతూ, ప్రజలపై మరింత భారం మోపుతూ వెళుతోంది.

Also Read: ఐపీఎల్ టికెట్లపై సైబర్ మోసాలు.. తస్మాత్ జాగ్రత్త..!

ట్రెండింగ్ వార్తలు