కాలేజీల్లోను..యూనివర్శిటీల్లోను అమ్మాయిలు..అబ్బాయిలు కలిసి తిరగటం సర్వసాధారణం. కానీ ఇకపై అటువంటివి కుదరదంటోంది ఓ యూనివర్శిటీ. అమ్మాయిలు..అబ్బాయిలు వర్శిటీ క్యాంపస్ లో గానీ..బైట గానీ కలిసి కూర్చోకూడదు..మీటింగ్ లు పెట్టుకుని కబుర్లు పెట్టుకోకూడదంటూ హుకుం జారీచేసింది. అదేమంటే వారంత కలిసి కూర్చోవటం వల్ల వారి చదువులు దెబ్బతింటున్నాయమంటూ పిచ్చి రీజన్స్ చెబుతోంది. పాకిస్తాన్‌లోని బహ్రియా యూనివర్సిటీ తీసుకున్న ఈ షాకింగ్ నిర్ణయంతో స్టూడెంట్ మండిపడుతున్నారు.
ఈ విషయంపై నిర్ణయం తీసుకోవటమే కాదు దాన్ని అమల్లోకి కూడా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంది. పాకిస్తాన్‌లోని బహ్రియా యూనివర్సిటీ.క్లాసుల్లో విద్యార్ధినీ, విద్యార్ధులు కలిసి కూర్చోకూడదనీ..క్యాంపస్ లో కూడా కలిసి కూర్చోవద్దంటూ నిషేధం విధించింది. దీనికి సంబంధించి వర్సిటీ రిజిస్టారర్ నుంచి ఓ నోటీసు విడుదల చేసినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. క్లాస్ రూముల్లో అమ్మాయిలు..అబ్బాయిలు వేర్వేరుగా కూర్చునేలా చూడాలంటూ ప్రొఫెసర్లకు ఆదేశాలు జారీ చేసింది.
విద్యార్ధులు ఓ క్యంపస్ నుంచి మరో క్యాంపస్‌కి మారే టైమ్ ను కూడా తగ్గించాలనీ..దానికి సంబంధించి ప్రొఫెసర్లు టైమ్ టేబుల్ తయారు చేయాలని వర్శిటీ జారీ చేసిన నోటీసులు తెలిపింది. ఒక క్లాస్ పూర్తి అయిన తరువాత మరో క్లాస్ జరగటానికి మధ్య గ్యాప్ ఉండటం వల్ల స్కూడెంట్స్ అంతా ఒకచోట చేరి మీటింగ్ కు పెట్టుకుంటున్నారనీ..దీని వల్ల వారి చదువులకు మంచిది కాదని వర్శిటీ అభిప్రాయపడింది. అలా జరగకుండా వెంట వెంటనే క్లాసెస్ నిర్వహించడం వల్ల స్టూడెంట్స్ కు మాట్లాడుకునే టైమ్ ను తగ్గించవచ్చునని తెలిపింది.
వర్సిటీ మేనేజ్ మెంట్ తీసుకున్న ఈ కొత్త నిబంధనలపై స్టూడెంట్ నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది. నెటిజన్లు కూడి మండిపడుతున్నారు. 2000 సంవత్సరంలోఈ యూనివర్సిటీని పాకిస్తాన్ నేవీ ప్రారంభించి..దీన్ని క్రమంగా లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్ లకు విస్తరించింది.కాగా..గతంలో కూడా కొన్ని పాకిస్థాన్ లోని కొన్ని వర్శిటీల్లో స్టూడెంట్స్ కు డ్రెస్ కోడ్ విధించటం పట్లకూడా వ్యతిరేకత వ్యక్తమైన విషయం తెలిసిందే.
So on the directives of Rector of #BahriaUniversity Islamabad: “seating of all male & female students be separated in classes, likewise out stations visits & grouping in projects be also made separately” A policy of radicalisation of an academic institution is shocking! pic.twitter.com/v8SIjVF1XE
— Saad Nazim (@Saad_Nazim) September 11, 2019