Asim Munir
Asim munir warns india : పాకిస్థాన్ ఫీల్డ్ మార్షల్‌గా ఉన్న అసీం మునీర్‌ను షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం తమ దేశ రక్షణ దళాల తొలి అధిపతి (సీడీఎఫ్)గా నియమించిన విషయం తెలిసిందే. సీడీఎఫ్‌గా నియమితులైన తరువాత తన మొదటి ప్రసంగంలో ఆసిమ్ మునీర్ ఇండియాపై నోరు పారేసుకున్నాడు. ఇండియాకు ఓ రకంగా వార్నింగ్ ఇచ్చాడు.
Also Read: Bomb threat : పేల్చేందుకు కుట్ర.. తెలంగాణ సీఎంవో, లోక్ భవన్‌లకు బాంబు బెదిరింపు
అసిమ్ మునీర్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఏదైన దురాక్రమణ జరిగితే ఇస్లామాబాద్ ప్రతిస్పందన మరింత వేగంగా.. తీవ్రంగా ఉంటుంది అంటూ భారత దేశాన్ని హెచ్చరించాడు. భారతదేశం ఎటువంటి భ్రమల్లో ఉండకూడదు.. ఎందుకంటే పాకిస్థాన్ ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని ఇండియాపై పిచ్చికూతలు కూశాడు.
కొత్తగా ఏర్పడిన రక్షణ దళాల ప్రధాన కార్యాలయ స్థాపనను చారిత్రాత్మకమైనది అని మునీరు అభివర్ణించాడు. సైన్యం, వైమానిక దళం, నావికాదళంకు చెందిన ఏకీకృత వ్యవస్థ ద్వారా బహుళ డొమైన్ కార్యకలాపాలను మెరుగుపర్చడం దీని లక్ష్యం అని పాకిస్థాన్ వార్తా చానెల్ జియో న్యూస్ నివేదించింది.
మునీర్ తన ప్రసంగంలో.. వివిధ రకాల్లో పలు వైపుల నుంచి పెరుగుతున్న ముప్పులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కొత్తగా ప్రారంభించిన రక్షణ దళాల ప్రధాన కార్యాలయం ఆధ్వర్యంలో మూడు సేవలను ఏకీకృతం చేయడం ప్రస్తుతం ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. ఆపరేషన్ సిందూరు సమయంలో పాకిస్థాన్ ప్రజల మద్దతు, సైన్యం పనితీరును మునీర్ ప్రశంసించాడు. భవిష్యత్ సంఘర్షణలకు దీనిని కేస్ స్టడీ అని మునీర్ పేర్కొన్నాడు.
యుద్ధాలు ఇప్పుడు సైబర్ స్పేస్, విద్యుదయస్కాంత స్పెక్ట్రం, అంతరిక్షం, సమాచార కార్యకలాపాలు, ఏఐ, క్వాంటం కంప్యూటింగ్‌లకు విస్తరించాయని. దేశానికి ఏ విధంగా ప్రమాదం పొంచిఉన్నా.. ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సాయుద దళాలు సిద్ధంగా ఉండాలని, ఆమేరకు సన్నద్ధం కావాలని మునీర్ పేర్కొన్నాడు.