Bomb threat : పేల్చేందుకు కుట్ర.. తెలంగాణ సీఎంవో, లోక్ భవన్‌లకు బాంబు బెదిరింపు

Bomb Threat : తెలంగాణ సీఎంవో, లోక్ భవన్‌లకు బాంబు బెదిరింపు కలకలం రేపింది. భవనాలను పేల్చడానికి కుట్ర చేస్తున్నారని

Bomb threat : పేల్చేందుకు కుట్ర.. తెలంగాణ సీఎంవో, లోక్ భవన్‌లకు  బాంబు బెదిరింపు

Bomb threat

Updated On : December 9, 2025 / 11:41 AM IST

Bomb threat : తెలంగాణ సీఎంవో, లోక్ భవన్‌లకు బాంబు బెదిరింపు కలకలం రేపింది. ఆ భవనాలను పేల్చడానికి కుట్ర చేస్తున్నారని అగంతకుడు ఈ-మెయిల్ పంపించాడు. ఏకంగా గవర్నర్ కార్యాలయానికి ఈ-మెయిల్ పంపించాడు.

వాసుకి ఖాన్ పేరుతో ఈ మెయిల్ వచ్చింది. వెంటనే వీఐపీలను, ప్రముఖులను అందులో నుండి ఖాళీ చేపించాలని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు రంగంలోకి దిగారు. హుటాహుటీన బాంబు స్క్వాడ్ తో సీఎంవో, లోక్ భవన్ వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ విషయంపై గవర్నర్ కార్యాలయ సిబ్బంది పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. గవర్నర్ సీఎస్ఓ శ్రీనివాస్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు ఈమెయిల్ పై దర్యాప్తు చేస్తున్నారు.