భారతీయ అమ్మాయికి పాకిస్తానీ అబ్బాయి సాయం

  • Publish Date - January 14, 2020 / 02:31 AM IST

భారత్, పాకిస్తాన్ దాయాది దేశాల మధ్య వైరం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది.  సామాన్యుల మధ్య కూడా ఇటువంటి వాతావరణమే కనిపిస్తుంది. పాకిస్తాన్లోని కొందరు భారతీయులపైన, భారత్‌లోని కొందరు పాకిస్తానీల పైన సోషల్ మీడియాలో కూడా తిట్టుకుంటూ ఉంటారు. అయితే దుబాయ్‌లో మాత్రం ఓ భారతీయ యువతికి పాకిస్తానీ సాయం చేశాడు. 

వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన రాచెల్‌ రోజ్‌ కుటుంబం దుబాయ్‌లో నివసిస్తోంది. రోజ్‌ ఇంగ్లాండ్‌లోని లాంక్‌స్టర్‌ విశ్వవిద్యాలయంలో న్యాయవిద్య చదువుతుంది. ఈనెల 4వ తేదీన తన స్నేహితురాలి పుట్టినరోజు వేడుకలకు వెళ్లేందుకు పాకిస్తాన్‌కు చెందిన మొదాసిర్‌ ఖాదిమ్‌ అనే వ్యక్తి క్యాబ్‌ ఎక్కింది. మధ్యలోనే తన స్నేహితులు వేరే కారులో కనిపించడంతో ఖాదిమ్‌ కారు దిగి వారితో కలిసి వెళ్లిపోయింది. ఆ సమయంలో రోజ్‌ తన వ్యాలెట్‌ను కారులో మరిచిపోయింది. 

చాలా సమయం గడిచిన తర్వాత ఖాదిమ్‌ తన కారులో వ్యాలెట్‌ను గమనించాడు. వ్యాలెట్‌లో రోజ్‌ యూకే స్టూడెంట్‌ వీసా, ఎమిరేట్స్‌ ఐడీ, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ డ్రైవింగ్ లైసెన్స్‌, హెల్త్‌ ఇన్యూరెన్స్‌ కార్డు, క్రెడిట్‌ కార్డుతో పాటు వెయ్యి దిర్హామ్‌లు ఉన్నాయి. వ్యాలెట్‌ను ఆమెకు చేర్చేందుకు ఖాదిమ్‌ అక్కడి రవాణా శాఖ అధికారులను సంప్రదించాడు. వాళ్లు ఇచ్చిన వివరాల ఆధారంగా ఖాదిమ్‌ రోజ్‌ ఇంటికి వెళ్లి ఆమెకు దానిని తిరిగి ఇచ్చేశాడు. సంతోషించిన రోజ్‌ తండ్రి డ్రైవర్‌ ఖాదిమ్‌కు 600 దిర్హామ్‌లు ఇవ్వగా అతను వద్దని తిరస్కరించాడు. రోజ్‌ తన సోదరి వంటిదేనంటూ చెప్పాడు.

ఒకవేళ అతను తిరిగి ఇవ్వకుంటే ఆమెకు ఆ వ్యాలెట్ వచ్చే అవకాశం కూడా లేదు. అంతకుముందే రోజ్‌ ఆలస్యం చేయకుండా తన వాలెట్‌ పొయ్యిందంటూ పోలీసులను ఆశ్రయించారు. రోజ్‌ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు ఆమె కారు ఎక్కిన ప్రదేశంలోని సీసీటీవీ ఫుటేజ్‌ని కూడా పరిశీలించారు. అయితే రోజ్‌ ఎక్కిన కారు నంబర్‌ మాత్రం కనిపించలేదు. రోజ్‌ కారు ఎక్కి.. వెంటనే దిగిపోవడంతో డ్రైవర్‌ మీటర్‌ కూడా వెయ్యలేదు.

దీంతో ఆర్టీఏ కాల్‌ సెంటర్‌ ద్వారా డ్రైవర్‌ ఆచూకీ తెలుసుకోలేకపోయారు. దీంతో ఆమె వాలెట్‌ను గుర్తించడం పోలీసులకు కష్టంగా మారింది. అయితే ఖాదీమ్‌కు వ్యాలెట్ కనిపించిన వెంటనే  రోజ్‌ను సంప్రదించడానికి ట్రై చేశాడు. అయితే అందుకు అతనికి అవసరం అయిన సమాచారం అందులో లేదు. అప్పుడు వెంటనే డ్రైవింగ్ లైసెన్స్ ద్వారా ఆమె ఆచూకి ఆర్టీఏ ద్వారా తెలుసుకుని ఆమెకు వ్యాలెట్ చేర్చారు. కేరళకు చెందిన భారతీయ కుటుంబం ఖాదీమ్‌ను అభినందిస్తూ ఆర్టీఏకు లేఖ రాసిం