Pakistan : ఐఎస్ఐ సాయం కోరిన టిక్ టాక్ స్టార్.. తన భర్త కిడ్నాప్ అయ్యారంటూ..
పాకిస్తానీ టిక్ టాక్ సంచలనం హరీమ్ షా భర్త బిలాల్ కిడ్నాప్ అయ్యారు. తన భర్త కిడ్నాప్ వెనుక పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ హస్తం ఉందని హరీమ్ షా ఆరోపిస్తుంటే.. ఆమె అత్తగారు మాత్రం సోషల్ మీడియాలో ఆమె పెట్టే పోస్టుల వల్లే కొడుకు కిడ్నాప్ అయ్యాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
- Lakshmi 10tv
- Updated on- September 5, 2023 / 03:06 PM IST
Pakistan
Pakistan : పాకిస్తానీ టిక్ టాక్ సంచలనం హరీమ్ షా తన భర్తను కిడ్నాప్ చేసారంటూ ఐఎస్ఐ సాయం కోరడం సంచలనంగా మారింది. మరియమ్ నవాజ్ ఆదేశాలతోనే తన భర్తను కిడ్నాప్ చేసారని ఆమె ఆరోపిస్తోంది.
పాకిస్తాన్ టిక్ టాక్ స్టార్ హరీమ్ షా (@_Hareem_Shah) తన భర్త బిలాల్ కిడ్నాపయ్యాడని ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని ఓ వీడియోలో వివరిస్తూ షా పాకిస్తాన్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) సాయం కోరారు. తన భర్త అమాయకుడని, అతనికి ఎటువంటి నేర చరిత్ర, రాజకీయ సంబంధాలు లేవని కూడా ఆమె చెబుతున్నారు. లండన్‌లో ఉన్న బిలాల్ పని నిమిత్తం పాకిస్తాన్ వెళ్లారని కరాచీలో తన భర్తను కిడ్నాప్ చేసారని హరీమ్ షా చెబుతున్నారు. భర్త కిడ్నాపై 7 రోజులు గడుస్తోందని ఇప్పటికే తాను కోర్టులో పిటిషన్ వేసినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని హరీమ్ షా వీడియోలో చెప్పుకొచ్చారు.
హరీమ్ షా మరో పోస్టులో తన భర్త బిలాల్ కిడ్నాప్ వెనుక పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ హస్తం ఉందని ఆరోపించారు. హరీమ్ షా గతంలో కొందరిని విమర్శిస్తూ ట్వీట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆగస్టు 21 న షా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కి సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేసారు. ఓ మహిళతో ఉన్న ఆయనను అతని కొత్త గాళ్ ఫ్రెండ్ అంటూ కామెంట్ చేసారు. ఇక భారత్ చంద్రయాన్-3 ప్రయోగం సమయంలో షా మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ పోస్టు పెట్టారు. ఈ ప్రయోగాలకు చేసే ఖర్చుతో భారతదేశం అంతటా మరుగుదొడ్లు నిర్మించడానికి ఉపయోగిస్తే మంచిది అంటూ కామెంట్ చేశారు.
మరోవైపు హరీమ్ షా సోషల్ మీడియా పోస్టుల కారణంగా తన కొడుకును బిలాన్ ను కిడ్నాప్ చేసారని అతని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
