Bengaluru : పాకిస్తాన్ వెళ్లిపోమంటూ ముస్లిం విద్యార్ధులను ధూషించిన టీచర్.. విద్యాశాఖకు ఫిర్యాదు చేసిన పేరెంట్స్

ముస్లిం విద్యార్దులను ఇండియా వదిలి పాకిస్తాన్ వెళ్లిపొమ్మన్నారని ఓ క్లాస్ టీచర్ ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. విద్యార్ధుల తల్లిదండ్రుల ఫిర్యాదుతో విద్యాశాఖ ఆ టీచర్‌ను బదిలీ చేసింది. ప్రస్తుతం ఆ టీచర్‌పై విచారణ జరుగుతోంది.

Bengaluru : పాకిస్తాన్ వెళ్లిపోమంటూ ముస్లిం విద్యార్ధులను ధూషించిన టీచర్.. విద్యాశాఖకు ఫిర్యాదు చేసిన పేరెంట్స్

Bengaluru

Bengaluru : క్లాసులో గొడవ పడుతున్న ఇద్దరు ముస్లిం విద్యార్ధుల్ని క్లాస్ టీచర్ పాకిస్తాన్ వెళ్లిపొమ్మన్నారనే ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. విద్యార్ధుల తల్లిదండ్రులు ఆ టీచర్ పై విద్యాశాఖకు ఫిర్యాదు చేసారు. ప్రస్తుతం ఆ టీచర్‌పై బదిలీ వేటు పడింది.

Uttar Pradesh : ముస్లిం బాలుడిని తోటి విద్యార్ధులతో కొట్టించిన టీచర్.. పిల్లల్లో వివక్ష అనే విషాన్ని నాటకండి అంటూ రాహుల్ గాంధీ ట్వీట్

కర్నాటకలో శివమొగ్గలోని ఉర్దూ విద్యాసంస్థలో కన్నడ భాషా ఉపాధ్యాయురాలు మంజులాదేవిపై బదిలీ వేటు పడింది. గొడవ పడుతున్న ఇద్దరు ముస్లిం విద్యార్ధులను ‘పాకిస్తాన్ వెళ్లండి.. ఇది హిందూ దేశం’ అని ధూషించారని విద్యార్ధులు ఆరోపిస్తున్నారు. ఆ పిల్లల తల్లిదండ్రులు ఈ విషయంపై విద్యాశాఖకు ఫిర్యాదు చేయడంతో ఆమెను వెంటనే బదిలీ చేశారు. ఆమెపై శాఖాపరమైన విచారణ జరుగుతోందని నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ బి.నాగరాజు తెలిపారు. ఆరోపణలు ఎదుర్కుంటున్న ఉపాధ్యాయురాలు 8 సంవత్సరాలుగా ఆ పాఠశాలలో పనిచేస్తున్నారని మొత్తంగా 26 సంవత్సరాల అనుభవం ఉందని అధికారులు చెప్పారు.

Uttar Pradesh: తప్పు చేశాను. కాకపోతే.. తోటి విద్యార్థులతో ముస్లిం విద్యార్థిని కొట్టిన టీచర్ వివరణ

ఇటీవలే ఉత్తరప్రదేశ్‌లోని ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలు త్రిప్తా త్యాగి ఏడేళ్ల ముస్లిం బాలుడిని చెప్పుతో కొట్టమని విద్యార్ధులను కోరిన వీడియో వైరల్ అయ్యింది. విద్యార్ధి ఏడుస్తూ నిలబడి ఉండగా తోటి విద్యార్ధులు అతనిని చెంపదెబ్బ కొట్టారు.