Viral Video : రియల్ హీరో.. గాల్లో విమానం.. పైలట్ స్పృహతప్పాడు.. ప్యాసెంజర్ సేఫ్ ల్యాండ్ చేశాడు..!

Viral Video : ఇది సినిమా కాదు.. నిజంగానే జరిగింది. విమానంలోని ప్రయాణికుల ప్రాణాలను కాపాడాడో మరో ప్రయాణికుడు. గాల్లో విమానం ఎగురుతుండగానే పైలట్ స్పృహతప్పాడు. విమానాన్ని కంట్రోల్ చేసే వారు లేరు.

Viral Video : ఇది సినిమా కాదు.. నిజంగానే జరిగింది. విమానంలోని ప్రయాణికుల ప్రాణాలను కాపాడాడో మరో ప్రయాణికుడు. గాల్లో విమానం ఎగురుతుండగానే పైలట్ స్పృహతప్పాడు. విమానాన్ని కంట్రోల్ చేసే వారు లేరు. ఇక విమానం కూలిపోతుంది.. అందరూ చనిపోతామని ప్రయాణికులంతా ఫిక్స్ అయిపోయారు. కానీ, అందులో ఒక ప్రయాణికుడు మాత్రం అలా అనుకోలేదు. ప్రయత్నిస్తే పోయేది ఏముంది.. ప్రాణాలు తప్పా.. అంతా అనుకున్నట్టు జరిగితే ప్రాణాలతో బయటపడతామనుకున్నాడు. అతడికి విమానం నడపడమే తెలియదు. పైలట్ సీట్లో కూర్చొని స్టీరింగ్ కంట్రోల్ తీసుకున్నాడు. చివరికి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశాడు. పైలట్ ప్రాణాలతో పాటు విమానంలోని ప్రయాణికులందరి ప్రాణాలను కాపాడి రియల్ హీరో అనిపించుకున్నాడు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే.. అమెరికాలోని సెస్నా 208 కారవాన్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో జరిగింది. అసలేం జరిగిందంటే.. బహమాస్‌‌లోని మార్ష్ హార్బర్ దగ్గరున్న లియోనార్డ్ ఎం థాంప్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి ఫ్లోరిడాకి ఫ్యాసెంజర్ విమానం బయల్దేరింది.

Passenger With ‘no Idea How To Fly’ Lands Plane In Florida After Pilot Falls Ill

గాల్లో విమానం ఉండగానే పైలట్ అనారోగ్యంతో స్పృహకోల్పోయాడు. దాంతో విమానం ఎటు వెళ్తుందో తెలియని పరిస్థితి. ఎక్కడ విమానం కూలిపోతుందోనన్న భయమే ప్రయాణికుల్లో కనిపిస్తుంది. ఇక తమ పని అయిపోయిందిలే అనుకున్న తరుణంలో ప్రయాణికుల్లో నుంచి ఒక ప్రయాణికుడు ధైర్యంగా ముందుకు వచ్చాడు. తన భార్య ప్రెగ్నెంట్ కావడంతో ఆమెకు ధైర్యం చెప్పాడు. పైలట్ సీట్లోకి వెళ్లి కూర్చొన్నాడు. తనకు ఏమి చేయాలో తెలియదు. విమానం నడపటం రాదు. విమానాన్ని ఎలా కంట్రోల్ చేయాలో కూడా తెలియదు. ఫోర్ట్ పియర్స్‌లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వారితో టచ్ లోకి వచ్చాడు. విమానం ఎలా కంట్రోల్ చేయాలి? ఎలా సేఫ్ గా ల్యాండ్ చేయాలో ఎప్పటికప్పుడూ సూచనలు తీసుకున్నాడు. కమ్యూనికేషన్ సిబ్బంది సూచించినట్టుగా విమానాన్ని ముందుకు నడిపాడు. పైలట్ స్పృహ కోల్పోయిన సమయంలో విమానం ఫ్లోరిడా తీరంపై ఎగురుతోంది. ఇంకా 105 కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంది. ఇలాంటి సమయంలో ఏమాత్రం భయపడకుండా ఆ ప్రయాణికుడు రియల్ హీరోలా ఎలాంటి అనుభవం లేనప్పటికీ విమానాన్ని నడిపాడు. చివరికి ఫ్లోరిడా ఎయిర్ పోర్టుకు రన్ వే పై సురక్షితంగా ల్యాండ్ చేశాడు.

అతడు విమానం నడిపే సమయంలో తోటి ప్రయాణికులకు నమ్మకం లేదు.. ప్రాణాలతో బయటపడతామని, అతడు ఏం చేస్తున్నాడో వారికి అర్థం కాలేదు. సీట్లలో కూర్చొకుండా అతడు ఏం చేస్తున్నాడో అలానే చూస్తుండి పోయారు. పామ్ పీచ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేయడంతో ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు. అనారోగ్యంతో ఉన్న పైలట్‌ను వెంటనే ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. ఈ ఘటనపై అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రతినిధి స్పందించారు. దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఎలాంటి అనుభవం లేకపోయినా తనని నమ్మిన ఫ్యామిలీతో పాటు ఇతర ప్రయాణికుల ప్రాణాలను కూడా కాపాడిన ప్రయాణికుడిని రియల్ హీరో అంటూ అందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. విమానాన్ని సేఫ్ గా ల్యాండ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Read Also : Honeytrap: హనీ ట్రాప్‌లో భారత వైమానిక దళ జవాన్.. భార్య బ్యాంక్ ఖాతాలో అనుమానాస్పద నగదు..

ట్రెండింగ్ వార్తలు