యువతిని రక్షించటానికి కారును ఎత్తిపడేశారు

  • Published By: chvmurthy ,Published On : January 29, 2020 / 03:43 PM IST
యువతిని రక్షించటానికి కారును ఎత్తిపడేశారు

Updated On : January 29, 2020 / 3:43 PM IST

మనం రోడ్డు మీది వెళ్తున్నప్పుడ ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఏం చేస్తాము.. వెంటనే ఆగి  దెబ్బ తిన్నవారిని ఆస్పత్రికి పంపేందుకు అంబులెన్స్ కు, పోలీసులకు ఫోన్ చేస్తాం. ప్రమాదం ఎక్కువ స్ధాయిలో ఉంటే సహాయం ఏరకంగా సహాయం చేయాలో అలా చేస్తాం. కానీ ఆమెరికాలో కారు కింద పడిన ఒక యువతిని రక్షించటానికి అంతా కలిసి కారుని ఎత్తిపడేసి ఆమెను కాపాడారు. దానికి సంబంధించిన  వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే…అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఆదివారం రాత్రి వెరోనికా అనే యువతి  రోడ్డు పక్కన ఫుట్ పాత్ పై నిలబడి ఉంది. ఆసమయంలో అటుగా వచ్చిన ఓ ఎస్‌యూవీ ఆమె మీదకు దూసుకొచ్చింది. దీంతో ఆమె కింద పడింది. ఆ పడటంలో వాహనం ఆమె మీదకు ఎక్కింది. ఆమె రెండు కాళ్లు ఎస్‌యూవీ వెనుక టైరు కింద ఇరుక్కపోయాయి. అంత బరువైన కారు కాళ్లమీద ఎక్కేసరికి బాధతో వెరోనికా కేకలు పెట్టింది. 

ఇది గమనించిన చుట్టుపక్కలవారు, రోడ్డుపై వెళ్తున్నవారంతా అలర్టై ఆ యువతిని రక్షించేందుకు గుంపుగా వెళ్లి ఆవాహనాన్ని చేతులతో పైకి ఎత్తేశారు. SUV కింద ఇరుక్కున్నవెరొనికాను వెంటనే బయటకు తీశారు. అంబులెన్స్ ను రప్పించి ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ప్రమాదంలో ఆమెకు పెద్దగా గాయాలు కాలేదని డాక్టర్లు తెలిపారు.