Penguins Chase Butterfly
penguins Gang chase a butterfly : రంగు రంగుల సీతాకోక చిలుకలు మన ఎదురుగా ఎగురుతుంటే వెంటపడి పట్టుకోవాలని అనిపిస్తుంది. కానీ పాపం దానికి ఏమవుతుందోనని ఆ అందాల సీతాకోక చిలుక కనపడినంత దూరం అలా రెప్ప వాల్చకుండా చూస్తుండిపోతాం. కానీ ఓ పెంగ్విన్ల గుంపు అందాల సీతాకోక చిలుక వెనక బుజ్జి బుజ్జి అడుగులు వేస్తూ పరిగెడితే ఎలా ఉంటుంది?ఇదిగో అ అద్భుతమైన వీడియో అంత గమ్మత్తుగా ఉంటుంది..!
పెంగ్విన్లు నడుస్తుంటే భలే వింతగా..గమ్మత్తుగా ఉంటుంది కదూ..చిట్టి చిట్టి అడుగులు వేస్తూ నడిచే పెంగ్విన్లు గబగబా పరిగిడితే ఇక రెప్ప వాల్చకుండా నవ్వుతూ చూస్తుండిపోతాం.అలాంటిది పెంగ్విన్ల గుంపు ఓ అందాల సీతాకోక చిలుక వెంట పరుగులు పెడతే ఎలా ఉంటోంది ఈ గమ్మతైన వీడియో చూస్తే తెలుస్తుంది. ఓ సీతాకోక చిలుకను వెంట చిట్టి చిట్టి అడుగులు వేస్తూ పరుగులు పెడుతున్న వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
ఈ వీడియోను ‘బిటెంగెబిడెన్’ అనే యూజర్ ట్విటర్‌లో షేర్ చేశారు. పెంగ్విన్ల గుంపు ఓ సీతాకోకచిలుకను పట్టుకునేందుకు ముద్దుముద్దుగా ఎగురుతూ ముందుకు పరుగు పెడుతున్నాయి. ఈ వీడియో చిన్నదే అయినా పదే పదే చూడాలనిపించేలా ఉంది. కాగా..నీటిలో ఉండే పెంగ్విన్ల సమూహాన్ని రాఫ్ట్ అని, భూమిపై ఉండే వాటిని వాడిల్ అని అంటారు. ఓ పెంగ్విన్ల సమూహం ఓ సీతాకోక చిలుకను వెంటాడుతున్న వీడియో నెటిజన్ల మనసు దోచుకుంటోంది. మరీ మీరు కూడా ఓ లుక్ వేసేయండి..
Penguins chasing a butterfly.. ? pic.twitter.com/ynP6oW49zm
— Buitengebieden (@buitengebieden) June 4, 2022