Penis Comes Out : ఇదేందయ్యా ఇది.. ఏడా సూడలె.. బయటకొచ్చిన పురుషాంగం, చేజారిన పతకం.. వీడియో వైరల్

కొలంబియాలో జరుగుతున్న యూ20 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీల్లో చిత్ర విచిత్రమైన ఘటన ఒకటి జరిగింది. షార్ట్... ఓ అథ్లెట్ కొంపముంచింది. షార్ట్ కారణంగా అతడు ఏకంగా పతకాన్ని చేజార్చుకున్నాడు. పురుషాంగం బయటకు వచ్చి తెగ ఇబ్బంది పడ్డాడు పాపం.

Penis Comes Out : కొలంబియాలో జరుగుతున్న యూ20 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీల్లో చిత్ర విచిత్రమైన ఘటన ఒకటి జరిగింది. షార్ట్… ఓ అథ్లెట్ కొంపముంచింది. షార్ట్ కారణంగా అతడు ఏకంగా పతకాన్ని చేజార్చుకున్నాడు. అంతేనా.. షార్ట్ సరిగా లేకపోవడంతో పురుషాంగం బయటకు వచ్చి తెగ ఇబ్బంది పడ్డాడు పాపం.

400 మీటర్ల రన్నింగ్ రేస్ లో పాల్గొన్న ఇటలీకి చెందిన అల్బెర్టో నోనినో తన షార్ట్ తో అవస్థ పడ్డాడు. అప్పటివరకు రేసులో టాప్ 2లో ఉన్న అతగాడు.. డ్రాయర్ ను సరిచేసుకునే ఒత్తిడిలో రేసులో చివరి స్థానంలో నిలిచాడు. కసిగా చిరుతలా పరుగు పెడుతుంటే సడన్ గా అతగాడి పురుషాంగం షార్ట్ నుంచి బయటకు వచ్చేసింది. దీంతో అతడు షాక్ తిన్నాడు. పురుషాంగాన్ని చేతితో పట్టుకుని లోపలికి తోస్తూ షార్ట్ ను సరి చేసుకునే పనిలో పడ్డాడు. కట్ చేస్తే.. రేసులో వెనుకబడిపోయాడు.

పురుషాంగం బయటకు వచ్చిన ఘటనపై అల్బెర్టో స్పందించాడు. అసలేం జరిగిందో చెప్పాడు. అండర్ వేర్ వేసుకోకుండానే షార్ట్ తోనే రేసులో పాల్గొనడంతో పురుషాంగం బయటకు వచ్చి ఇలా జరిగిందని అతగాడు వివరించాడు.

అప్పటివరకు 18ఏళ్ల అల్బెర్టో చిరుతలా పరిగెత్తుతున్నాడు. కచ్చితంగా పతకం వచ్చేది. ఇంతలో తన పురుషాంగం బయటకు వచ్చేయడంతో అతడు ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. నోనినో తన రన్నింగ్ షార్ట్స్‌లో తన పురుషాంగాన్ని తిరిగి ఉంచడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ అతని ప్రయత్నాలు విఫలమయ్యాయి. చేత్తో పురుషాంగాన్ని పట్టుకుని వేగంగా పరిగెత్తలేకపోయాడు. ఫలితంగా ఈ రేసులో అతడు చివరి స్థానంలో నిలిచాడు.

ఈ సంఘటన తర్వాత, 18 ఏళ్ల అల్బెర్టో.. ఇంటర్నెట్‌లోకి వెళ్లి, దాని గురించి బ్లాగ్‌లు మరియు పోస్ట్‌లకు లింక్‌లు పంపడం ఆపమని నెటిజన్లను అభ్యర్థించాడు. ఇది ప్రమాదవశాత్తూ జరిగిన ఘటన అని, ఇక్కడితో దీన్ని వదిలేయాలని కోరాడు. జరిగిన దాని గురించి నవ్వడానికి ప్రయత్నిస్తున్నా అని అల్బెర్టో నోనినో అన్నాడు. అథ్లెట్ రేసులో 51.57 సెకన్ల టైమింగ్‌తో అతడు చివరి స్థానంలో నిలిచాడు. కాగా ఈసారి బలమైన పునరాగమనం చేస్తానని వాగ్దానం చేశాడు. కాగా, ఓ చిన్న తప్పిదం కారణంగా పతకం కోల్పోవడాన్ని అల్బెర్టో జీర్ణించుకోలేకపోతున్నాడు. అండర్ వేర్ ఎంత పని చేసింది అని తెగ ఫీల్ అవుతున్నాడట.

రన్నింగ్ రేసులో చిరుతలా పరిగెడుతున్న సమయంలో సడెన్ గా షార్ట్ నుంచి పురుషాంగం బటయకు వచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూశాక కొందరిలో అస్సలు నవ్వు ఆగడం లేదు. మరికొందరు అయ్యో పాపం అని జాలి చూపించారు.

పురుషాంగం బయటకు వచ్చింది.. పతకం పోయింది

ట్రెండింగ్ వార్తలు