Bomb Pizza
Bomb Pizza : పిజ్జా (Pizza) అంటే పిల్లలు, పెద్దలు తెగ ఇష్టపడతారు. రీసెంట్ టైమ్స్ లో రకరకాల ప్రయోగాలతో ఈ పిజ్జాలు తయారు చేస్తున్నారు. అయితే ఇప్పుడో కొత్తరకం పిజ్జా జనాల్ని భయపెడుతోంది.
Edgardo Greco: పిజ్జా చెఫ్‌గా పని చేస్తున్న మాఫియా డాన్.. 16 ఏళ్లకు పట్టుబడ్డ నిందితుడు
చూడటానికి గోపురంలా అనిపిస్తుంది. సర్వర్ దాని మీద ఏదో లిక్విడ్ పోశాడు. లైటర్ తో దానిని వెలిగిస్తే మంట వచ్చింది. కొద్దిసేపటి తర్వాత మంట ఆపాడు. ఇక పైన ఉన్న షేప్ ని కత్తెరతో కట్ చేసాడు. ఆ తరువాత పిజ్జాను కట్ చేసాడు. ఆ తరువాత దాన్ని సెర్వ్ చేశాడు. ఈ తతంగమంతా వీడియో తీసి ఇంటర్నెట్ లో పోస్ట్ చేశారు. @MediumSizeMeech అనే యూజర్ దీనిని షేర్ చేయడంతో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.ఇంతకీ దీని పేరు చెప్పలేదు కదూ ‘బాంబ్ పిజ్జా’ (bomb pizza). ఈ వీడియో చూసిన చాలామంది నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు.
ఇది మష్రూప్‌తో (Mushrooms) చేసిన వంటకంలాగ ఉందని కొందరు.. కత్తెరతో ఈ బాంబ్ పిజ్జాను కట్ చేసిన స్టైల్ చూస్తే ఆకలి చచ్చిపోతుంది అని కొందరు..బూజులా అసహ్యంగా ఉందని కొందరు కామెంట్లు పెట్టారు. ఇక ఈ బాంబ్ పిజ్జా టేస్ట్ చేసిన వారి పరిస్థితి, అభిప్రాయం ఏంటో తెలియాలి.
This is supposed to be PIZZA??? The reveal… This looks like tapioca pudding poured over old newspapers pic.twitter.com/yobLqsBsMa
— Meech (@MediumSizeMeech) April 15, 2023