Peru Country
Peru Country: మైనర్ బాలికలపై అత్యాచారంకు పాల్పడితే జరిమానాతో పాటు రసాయన విధానంలో వీర్యహరణ శిక్ష (రసాయన కాస్ట్రేషన్)ను అనుమతించే బిల్లును పెరూ ప్రభుత్వం ఆమోదించేందుకు సిద్ధమైనట్లు క్యాబినెట్ సభ్యులు బుధవారం తెలిపారు. పెరూ దేశంలో మూడేళ్ల బాలికపై 48ఏళ్ల వ్యక్తి అత్యాచారంకు పాల్పడ్డాడు. ఈ నెల ప్రారంభంలో సదరు వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనతో ఆదేశ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొనేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా న్యాయ మంత్రి ఫెలిక్స్ చెరో మాట్లాడుతూ.. అత్యాచారానికి పాల్పడే వారికి అదనపు జరిమానాగా ఈ రసాయన కాస్ట్రేషన్ ఉంటుందని మేము భావిస్తున్నామని అన్నారు. మైనర్ల పై అత్యాచారం చేసేవారు జైలు శిక్ష అనుభవించి తీరాలి, అదే సమయంలో శిక్షాకాలం ముగిసిలోగా రసాయనికంగా కాస్ట్రేషను విధించాలని ప్రభుత్వం భావిస్తోందని ఆయన అన్నారు.
Kodada Rape Incident : కోదాడలో దారుణం.. కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి 3 రోజులుగా అత్యాచారం
ఇదిలాఉంటే పెరూ దేశ అధ్యక్షుడు పెడ్రో కాస్టిల్లో సామాజికంగా సంప్రదాయవాద మాజీ పాఠశాల ఉపాధ్యాయుడు. మైనర్‌లపై అత్యాచారం చేసే వ్యక్తులను శ్రేష్ఠమైన పద్ధతిలో శిక్షించాల్సిన అవసరం ఉందని, బిల్లుకు మద్దతుగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ (బిల్లు)కి మద్దతు ఇస్తుందని మేము ఆశిస్తున్నామని కాస్టిల్లో ఈవారం ప్రారంభంలో చెప్పారు. చట్టంగా మారాలంటే, బిల్లు పెరూ యొక్క ప్రతిపక్ష నియంత్రిత కాంగ్రెస్ ద్వారా ఆమోదించబడాలి. అయితే మైనర్‌పై అత్యాచారం చేసినందుకు మరణశిక్షను శిక్షగా చేర్చడానికి ప్రత్యామ్నాయ ప్రతిపాదన చేసిన కొందరు చట్టసభ సభ్యులలో మెజారిటీ సంఖ్యలో ఉన్నారు.
Peru: పెరూలో కూలిన విమానం..ఎడారి పర్యటనకు వెళుతున్న ఏడుగురు దుర్మరణం
ఇక్కడ మరో విషయం ఏమిటంటే తాజాగా ప్రభుత్వ ఆలోచన పై ఆ దేశ మహిళా సంఘాలు తప్పుపట్టినట్లు తెలిసింది. లైంగిక హింసను ఎగ్జిక్యూటివ్ అర్థం చేసుకోలేకపోయినందుకు మేము చింతిస్తున్నామని మహిళా హక్కుల సంఘం ఫ్లోరా ట్రిస్టన్ ట్విట్టర్‌లో పేర్కొంది. మాకు కావలసింది న్యాయ ప్రక్రియలను వేగవంతం చేయడానికి, సంరక్షణను మెరుగుపరచడానికి, లైంగిక చర్యలు నివారణనను బలోపేతం చేయడానికి అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే రాజకీయ నాయకులు ఈ విధానంపై చర్చించడం ఇదే మొదటిసారి కాదు. 2018లో 14 ఏళ్లలోపు పిల్లలపై అత్యాచారంకు పాల్పడేవారికి రసాయన కాస్ట్రేషన్‌ను జరిమానాగా చేర్చాలని కాంగ్రెస్ ముందుకు వచ్చింది. అయితే ఆ ప్రతిపాదన అమలుకు నోచుకోలేదు.