World Photography Day 2023: ఒక్క ఫోటో.. ఎన్నో జ్ఞాపకాలు .. నేడు వరల్డ్ ఫోటోగ్రఫీ డే

ఇప్పుడు ఫోటో దిగాలంటే చేతిలోని ఫోన్‌తో వందల కొద్దీ ఫోటోలు దిగొచ్చు. కానీ ఒకప్పుడు ఫోటో దిగాలంటే కూడా సంబరమే. స్టూడియో నుంచి ఆ ఫోటోలు తెచ్చుకునే వరకూ ఎదురుచూపులు. ఒక ఫోటో వెనుక ఒక కథ ఉంటుంది. కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి. సెల్ ఫోన్లో చూసుకునే ఫోటోలకి ఆల్బమ్ తడిమి చూసుకున్న అనుభూతికి చాలా తేడా ఉంది. ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం.

World Photography Day 2023

World Photography Day 2023: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం 2023: మనం సంతోషంగా ఉన్నప్పుడు మధుర జ్ఞాపకాల్ని పంచుకోవడమే కాదు.. మనతో లేనివారి జ్ఞాపకాలు కూడా పంచుతుంది ఫోటో. ప్రతి సందర్భంలో మనం తీసుకున్న ఫోటోల ఆల్బమ్ తడిమి చూస్తే ఎంతో సంతోషాన్ని పంచుతుంది. ఈరోజు ‘వరల్డ్ ఫోటోగ్రఫీ డే’. ఈ రోజు జరుపుకోవడం వెనుక చరిత్ర తెలుసుకుందాం.

Abdul Kalam : బహుమతికి కూడా డబ్బు చెల్లించిన అబ్దుల్ కలాం.. కలాం ఇచ్చిన చెక్కును ఫోటో ఫ్రేమ్ కట్టించుకున్నకంపెనీ

ఫోటోగ్రఫీ అనేది గ్రీకు పదం నుంచి వచ్చింది. ఫోటో అంటే కాంతి గ్రాఫీ అంటే తీసుకోవడం. ఈ దినోత్సవాన్ని ఆగస్టు 19, 1910 లో మొదటిసారి జరిపారు. ఫోటోగ్ర‌ఫీ దినోత్స‌వం ఫ్రెంచ్ దేశానికి చెందిన లూయీస్ డాగ్యురో అనే శాస్త్ర‌వేత్త ఆవిష్క‌ర‌ణ‌ల నుంచి పుట్టింది. 1839 ఆగస్టు 19న ఫ్రాన్స్‌ ప్రభుత్వం ఫొటోగ్రఫీపై పేటెంట్ హక్కులను కొనుగోలు చేసి దానిని ప్రపంచానికి ఉచిత బహుమతిగా అందించింది. అప్పటినుంచి ఏటా ఆగస్టు 19 న ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం నిర్వహిస్తున్నారు.

ఇండియా ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫిక్ కౌన్సిల్ 1991 నుంచి ప్రతి ఏటా ఆగస్టు 19 న ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని జరపడం ప్రారంభించింది. 1840 లో ఇండియాలో ఫోటోగ్రఫీ ఆనవాళ్లు ఉన్నాయి. మొట్టమొదటి కేలోటైప్ ఫోటో స్టూడియో కోల్‌కతాలో స్ధాపించారు. మొదట్లో దీనిని బ్రిటీష్ రాజు, జమిందార్లు మాత్రమే ఉపయోగించేవారట. ఆ తరువాత 1877 నుంచి అందరికీ అందుబాటులోకి వచ్చింది. మొట్ట మొదటి కలర్ ఫోటో 1861 లో తీశారట.

Allu Arjun : అల్లు అర్జున్ కూతురు అర్హ.. మొదటిరోజు స్కూల్ ఫోటో చూశారా..?

ఫోటోగ్రఫీపై అనేక యూనివర్సిటీలు శిక్షణ ఇస్తున్నాయి. ఒకప్పుడు మగవారు మాత్రమే ఫోటోగ్రఫీ ఇష్టపడేవారు. ఇప్పుడు మహిళలు సైతం ఈ రంగంపై ఆసక్తి చూపుతున్నారు. ఈరోజు ప్రత్యేకంగా ఫోటోలు వాటిపై కథలు, క్రియేటివ్ ఫోటోగ్రఫీ, సాంకేతికంగా వచ్చిన మార్పులు పలు అంశాలపై చర్చిస్తారు. చాలా చోట్ల సంబంధిత ఈవెంట్లు జరుగుతాయి. ఫోటోగ్రఫీ ప్రదర్శనలు, పోటీలు నిర్వహిస్తారు. ఈ సందర్భంలో ఫోటోగ్రాఫర్లందరికీ ‘వరల్డ్ ఫోటోగ్రఫీ డే’ శుభాకాంక్షలు.