ప్రకృతి అంటే అదే : కార్చిచ్చులో కాలిన చెట్లకు కొత్త చిగుర్లు..

  • Publish Date - January 13, 2020 / 06:12 AM IST

వాడిన పూలే వికసించెను అన్నట్లుగా అగ్నికి కాలిపోయిన చెట్లు చిగురిస్తున్నాయి. అదే ప్రకృతి గొప్పదనం. కార్చిచ్చులో నల్లగా కలిపోయిన చెట్టల మోడులుగా మారిపోయాయి. పచ్చదనంతో ఆహ్లాదనం కలిగించే ఆస్ట్రేలియా అడవులు కార్చిచ్చుకు కాలిపోయాయి. ప్రకృతి గొప్పదనంతో నల్లగా కాలిపోయి బొగ్గుల్లా మారిపోయిన చెట్ల మరలా చిగురిస్తున్నాయి. పచ్చని చిగుళ్లతో ప్రకృతి విలయాన్ని తట్టుకుని నిలబడ్డాయి. 

అస్ట్రేలియాలోని ఝాడీనుమా అడవుల్లో కార్చిచ్చు రగిలింది. కోట్లాది వన్యప్రాణులు సజీవంగా దహనమైపోయాయి. లక్షలాదిగా గాయాలపాలయ్యాయి..ప్రాణాపాయ స్థితికి గురయ్యాయి.  ఈ క్రమంలో లెక్కలేనన్ని చెట్లు..మొక్కలు అగ్నికి తగులబడిపోయాయి. అయితే ఇప్పుడు కొన్ని చెట్లకు కొత్త చివుళ్లు సంతరించుకుంటున్నాయి. అడవిలో నూతన జీవనం అంకురిస్తోంది. అక్కడి ఫొటోగ్రాఫర్లు కొన్ని ఫొటోలను విడుదల చేశారు. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్‌కు చెందిన ముర్రే లోవ్ ఈ వారం ఎన్‌ఎస్‌డబ్ల్యు సెంట్రల్ కోస్ట్‌లోని కుల్నారా నుండి తీసిన ఫోటోలను షేర్ చేశారు. 

“వర్షం లేకుండానే కాలిపోయిన చెట్ల బెరడు నుంచి కొత్త జీవితం ప్రారంభమవుతోంది. జీవిత చక్రం మళ్ళీ ప్రారంభమవుతుంది. చెట్లు తిరిగి చిగురించటం చాలా సంతోషంగా ఉంది’’ అంటూ ముర్రే ఆనందరం వ్యక్తంచేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఆస్ట్రేలియా కార్చిచ్చులో ఇప్పటివరకూ 28 మంది మృత్యువాతపడగా కోట్లాది వన్యప్రాణాలు చనిపోయాయి.