Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. 110 మంది సైనికులతో వెళ్తుండగా ఘటన..

Plane Crash: దక్షిణ అమెరికా దేశమైన కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. 110 మంది సైనికులతో వెళ్తున్న టేకాఫ్ అవుతుండగా కూలిపోయింది.

Colombia Plane Crash

Plane Crash: దక్షిణ అమెరికా దేశమైన కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. 110 మంది సైనికులతో వెళ్తున్న లాక్‌హీడ్ మార్టిన్ హెర్క్యులస్ సి-130 విమానం.. ప్యూర్టో లెగుయిజామో పట్టణం నుంచి టేకాఫ్ అవుతున్న సమయంలో కూలిపోయింది. విమానం కూలిపోయిన వెంటనే మంటలు అంటుకొని దట్టమైన పొగలు వ్యాపించాయి. ఘటన జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.

Also Read : Gold Rate decreased : గంటల వ్యవధిలోనే కుప్పకూలిన బంగారం ధర.. గతంలో ఎప్పుడూ లేనంతగా.. కొత్త ధరలు ఇవే!

రక్షణ మంత్రి పెడ్రో సాంచెజ్ ఈ ఘటన పై మాట్లాడుతూ.. పెరూ సరిహద్దులో కొలంబియా దక్షిణ అమెజాన్ ప్రాంతంలోని ప్యూర్టో లెగుయిజమో నుంచి సైనికులను తరలిస్తున్న విమానం టేకాఫ్ అవుతుండగా కూలిపోయిందని తెలిపారు. అయితే ఈ ఘటన దేశానికి తీవ్ర విషాదకరం అని ఆయన అన్నారు. ఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. మృతుల సంఖ్య, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని ఆయన పేర్కొన్నారు.

ఇదిలాఉంటే.. స్థానిక మీడియా పంచుకున్న వీడియోలో .. విమాన ప్రమాదం జరిగిన ప్రదేశంలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సైనికులను తీసుకెళ్తున్న ట్రక్కులు ఆ ప్రాంతానికి వెళ్లడం కనిపించింది.