Plane Crash in southkorea
Plane Crash in southkorea: దక్షిణ కోరియాలోని మువాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో ప్రయాణిస్తున్న జెజు ఎయిర్‌వేస్‌కు చెందిన 7సీ2216 ప్యాసింజర్ విమానం ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవుతున్న సమయంలో ప్రమాదానికి గురైంది. ల్యాండ్ అవుతుండగా టెక్నికల్ సమస్య తలెత్తడంతో రన్ వేపై ఆగకుండా దూసుకెళ్లి ఎయిర్ పోర్టులోని రక్షణ గోడను బలంగా ఢీకొట్టింది. ఈ క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భారీ ప్రమాదం చోటు చేసుకుంది.
ఘోర విమాన ప్రమాదంలో 28 మంది ప్రయాణికులు మృతిచెందినట్లు తెలుస్తుండగా.. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ విమానం బ్యాంక్ నుంచి మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంకు వస్తుంది.. మువాన్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విమానం రన్ వేపై ఆగకుండా వేగంగా వెళ్లి గోడును ఢీకొట్టడంతో మంటలు చెలరేగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఘటన జరిగిన వెంటనే రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. అయితే, కొందరు ప్రయాణికులు సజీవంగా బయటపడినట్లు తెలుస్తోంది. ఎంత మంది మరణించారు, ఎంత మంది గాయపడ్డారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
మూడురోజుల క్రితం కజకిస్థాన్ లో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అజర్ బైజాన్ నుంచి రష్యాకు వెళ్తున్న విమానం అక్టౌ విమానాశ్రయానికి మూడు కిలో మీటర్ల దూరంలోని భూముల్లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 38 మంది మరణించగా.. మరో 30 మందికి గాయాలయ్యాయి. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో మొత్తం ఐదుగురు విమాన సిబ్బందితో సహా 67 మంది ఉన్నారు. ఈ ఘటన మరవక ముందే ప్రస్తుతం దక్షిణ కొరియాలోని మువాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఘోర ప్రమాదం ఘటన చోటు చేసుకుంది. విమానం ప్రమాదానికి గురైన సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడం, దట్టమైన పొగలు కమ్ముకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
BREAKING: At least 28 killed at South Korean airport following plane crash – Yonhap pic.twitter.com/2ziXMYL9lI
— Faytuks News (@Faytuks) December 29, 2024
🚨 #BREAKING: A Boeing 737 carrying 175 passengers has just crashed in South Korea, resulting in a MASSIVE fireball
Rescue efforts are currently underway. Cause is unknown.
Jeju Airlines Flight 2216 was on approach to Muan International Airport from Bangkok pic.twitter.com/TwnPIG2VJd
— Nick Sortor (@nicksortor) December 29, 2024