Strict SIM Rules 2025 : సైబర్ మోసాలకు చెక్.. సిమ్ కార్డులపై కఠినమైన నిబంధనలు.. ఉల్లంఘిస్తే బ్లాక్ లిస్టు.. మూడేళ్ల వరకు కొత్త సిమ్ పొందలేరు!

Strict SIM Rules 2025 : కొత్త నిబంధనల ప్రకారం.. ఉల్లంఘించిన సిమ్ కార్డు యూజర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టేస్తుంది. తద్వారా మూడేళ్ల వరకు సిమ్ కార్డ్‌ల నిషేధాన్ని విధించనున్నారు.

Strict SIM Rules 2025 : సైబర్ మోసాలకు చెక్.. సిమ్ కార్డులపై కఠినమైన నిబంధనలు.. ఉల్లంఘిస్తే బ్లాక్ లిస్టు.. మూడేళ్ల వరకు కొత్త సిమ్ పొందలేరు!

Strict SIM Rules announced to combat cyber fraud

Updated On : December 28, 2024 / 7:53 PM IST

Strict SIM Rules : 2025 సంవత్సరం టెలికాం ప్రపంచానికి ఎన్నో మార్పులు తీసుకురాబోతోంది. ముఖ్యంగా ఒకటి కన్నా ఎక్కువ సిమ్ కార్డ్‌లను ఉపయోగించే యూజర్లకు కొత్త నిబంధనలు వర్తించనున్నాయి. సిమ్ కార్డుల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కొంతమంది ప్రత్యేక సిమ్ కార్డు యూజర్ల జాబితాను తయారు చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త సిమ్ కార్డులను వీరికి జారీ చేయవద్దని టెలికం కంపెనీలను సూచించింది.

మొబైల్‌లో పెరుగుతున్న స్పామ్ కాల్స్, మోసాలపై కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తోంది. సైబర్ మోసాలను నియంత్రించడానికి కొత్త నిబంధలను అమలు చేయనుంది. ఇందులో భాగంగానే టెలికాం నిబంధనలలో కేంద్రం అనేక మార్పులు చేసింది. ఈ సందర్భంగా ఎవరి పేరు మీద సిమ్ కార్డులు జారీ చేయకూడదో నిషేధిత జాబితాను రూపొందించింది.

ముఖ్యంగా సిమ్ కార్డ్‌లతో మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠినమైన చర్యలను ప్రవేశపెట్టింది. కొత్త నిబంధనల ప్రకారం.. ఉల్లంఘించిన సిమ్ కార్డు యూజర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టేస్తుంది. తద్వారా మూడేళ్ల వరకు సిమ్ కార్డ్‌ల నిషేధాన్ని విధించనున్నారు.

కోట్లాది మంది మొబైల్ యూజర్లను రక్షించడానికి, సిమ్ కార్డ్ దుర్వినియోగంతో ముడిపడిన సైబర్ నేరాలను నిరోధించడానికి టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) చర్యలను ప్రారంభించింది. ఈ చొరవలో భాగంగా, ఇతరుల పేర్లతో సిమ్‌లను పొందడం లేదా ఫేక్ ఎస్ఎంఎస్‌లను పంపడం వంటి మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని ఈ బ్లాక్‌లిస్ట్ జాబితాను రూపొందించింది.

Read Also : Vivo X200 Ultra Launch : వివో X200 అల్ట్రా ఫోన్ లాంచ్ టైమ్‌లైన్ లీక్.. భారత్‌కు ఈ మోడల్ వస్తుందా?

ఫేక్ కాల్స్, ఎస్ఎంఎస్ స్కామ్‌లను అరికట్టడానికి ఇటీవలి ట్రాయ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ చర్యలను చేపట్టింది. దేశవ్యాప్తంగా లక్షలాది మొబైల్ నంబర్లు డిస్‌కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇటీవల ప్రభుత్వం (eKYC) ధృవీకరణను తప్పనిసరి చేసింది. అది లేకుండా సిమ్ కార్డులు జారీ చేయరు.

సైబర్ మోసం, సిమ్ కార్డుల దుర్వినియోగం నిరోధించడానికి ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. వాస్తవానికి, ఈ విధానం ద్వారా మరొకరి పేరుతో సిమ్ కార్డులను కొనుగోలు చేసి, ఆ నంబర్‌ను దుర్వినియోగం చేసే వ్యక్తులను అరికట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

Strict SIM Rules announced

Strict SIM Rules announced

మోసపూరిత సిమ్ కార్డ్ యూజర్లపై కఠినమైన పెనాల్టీలు :
నేరస్థులను బ్లాక్‌లిస్ట్ చేయడం : సిమ్ కార్డ్‌లతో సైబర్ మోసానికి పాల్పడి దోషులుగా తేలిన వారిని బ్లాక్‌లిస్టింగ్‌లో పెడతారు.
సిమ్ జారీపై నిషేధం : 6 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు బ్లాక్ లిస్టులో ఉండే పేర్లపై కొత్త సిమ్ కనెక్షన్లు జారీ చేయరు.
శిక్షార్హమైన నేరాలు : మరొకరి పేరుతో జారీ చేసిన సిమ్ కార్డ్‌లను ఉపయోగించడం లేదా మోసపూరిత మెసేజ్‌లను పంపడం నేరంగా పరిగణిస్తుంది.

2025లో మారనున్న సిమ్ కార్డు రూల్స్ :
2025 సంవత్సరం నుంచి బ్లాక్‌లిస్ట్ అయిన వినియోగదారుల పేర్లు కొత్త కనెక్షన్‌లను పొందకుండా నిరోధించడానికి అన్ని టెలికాం ఆపరేటర్‌లతో డేటా షేర్ అవుతుంది. దీన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం అలాంటి వ్యక్తుల కేంద్రీకృత రిపోజిటరీని క్రియేట్ చేస్తోంది.

పట్టుబడితే కఠిన చర్యలు :
టెలికమ్యూనికేషన్స్ శాఖ బ్లాక్ లిస్టులో ఉన్న యూజర్ల సిమ్ ముందుగా బ్లాక్ చేస్తారు. అంతేకాదు.. ఆ వ్యక్తి పేరు మీద 6 నుంచి 3 ఏళ్ల వరకు కొత్త సిమ్ కార్డు జారీ చేయరు. చర్య తీసుకునే ముందు, అలాంటి వ్యక్తులకు ప్రభుత్వం నోటీసు కూడా పంపుతుంది. ఇందుకు వారు 7 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలి. అయితే, ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన కేసుల్లో ఎలాంటి నోటీసులు పంపకుండా చర్యలు తీసుకుంటామని టెలికమ్యూనికేషన్స్ విభాగం కూడా స్పష్టంగా చెబుతోంది.

సైబర్‌ సెక్యూరిటీ నిబంధనలు మరింత పటిష్టం :
నవంబరు 2024లో నోటిఫై చేసి సవరించిన నియమాలు, సైబర్‌ సెక్యూరిటీ చర్యలను బలోపేతం చేయడానికి అనేక కొత్త నిబంధనలను అమలు చేయనుంది. ఈ చర్యలు సిమ్ ఆధారిత మోసాలను అరికట్టడం, టెలికాం సేవలపై ప్రజల నమ్మకాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.

Read Also : Luxury Car Sales 2024 : 2024 ఏడాదిలో లగ్జరీ కార్ల అమ్మకాల రికార్డు.. ప్రతి గంటకు 6 లగ్జరీ కార్ల విక్రయాలు..