ఘోర విమాన ప్రమాదం.. విమానాశ్రయంలో పార్క్ చేసిన విమానంపైకి దూసుకెళ్లిన మరో విమానం.. వీడియో వైరల్

ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. మోంటానా విమానాశ్రయంలో ల్యాండ్ అయిన విమానంపైకి మరో చిన్న విమానం దూసుకెళ్లింది.

Plane Crashes

Plane Crashes: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. మోంటానా విమానాశ్రయంలో ల్యాండ్ అయిన విమానంపైకి మరో చిన్న విమానం దూసుకెళ్లింది. ఈ ఘటనతో భారీగా మంటలు చెలరేగాయి. అయితే, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని, కొందరికి స్వల్ప గాయాలైనట్లు అధికారులు తెలిపారు.

Also Read: Nagarjuna Sagar Dam: డేంజర్ జోన్‌లో నాగార్జున సాగర్.. అసలు పొంచి ఉన్న ప్రమాదం ఏంటి?

కాలిస్పెల్ పోలీస్ చీఫ్ జోర్దాన్ వెనెజియో, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపిన వివరాల ప్రకారం.. నలుగురు వ్యక్తులతో ప్రయాణిస్తున్న సింగిల్ ఇంజిన్ విమానం సోమవారం మధ్యాహ్నం 2గంటల సమయంలో కాలిస్పెల్ నగర విమానాశ్రయంలో ల్యాండ్ కావడానికి ప్రయత్నించిన సమయంలో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలిపారు.

సోకాటా టీబీఎం 700 టర్బోప్రాస్ విమానం విమానాశ్రయంలో నేలపై ప్రయాణికులులేని ఓ ఖాళీ విమానాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలతో మంటలు రావడంతో విమానాశ్రయ సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారని, వారికి విమానాశ్రయంలో చికిత్స అందించామని కాలిస్పెల్ అగ్నిమాపక అధికారి జే. హేగెన్ తెలిపారు.


మోంటావా విమానాశ్రయం 30వేల జనాభా కలిగిన కాలిస్పెల్ నగరానికి దక్షిణంగా ఉంది. ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించిన విమానం మంటల్లో చిక్కుకుంది. ఈ సమయంలో విమానం నుంచి పైలట్‌తో పాటు ముగ్గురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. వీరిలో ఇద్దరు ప్రయాణికులకు స్వల్పంగా గాయాలయ్యాయి. వారికి విమానాశ్రయంలోనే చికిత్స అందించడం జరిగిందని అధికారులు తెలిపారు.