Nepal
Nepal plane crash: నేపాల్ లో గల్లంతైన తారా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం ఆచూకీ లభించింది. ముస్టాంగ్ సమీపంలోని కోవాంగ్ గ్రామంలో కూలిపోయినట్లు నేపాల్ ఆర్మీ ఉన్నతాధికారి బ్రిగేడియర్ జరనర్ నారాయణ్ సిల్వాల్ వెల్లడించారు. విమాన శకలాల సమీపంలో మృతదేహాలను గుర్తించినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆర్మీ విడుదల చేసింది. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని వారు తెలిపారు. నేపాల్ తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన 9 NEAT ట్విన్ ఇంజిన్ విమానం ఆదివారం ఉదయం గల్లంతైంది. ఇందులో ముగ్గురు సిబ్బంది సహా మొత్తం 22 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికుల్లో నలుగురు భారతీయులు ఉన్నారు. వీరి ముంబయికి చెందిన వారిగా గుర్తించారు. ఇద్దరు జపనీయులు కూడా ఉన్నారు.
Search and rescue troops have physically located the plane crash site. Details will be followed.
— NASpokesperson (@NaSpokesperson) May 30, 2022
పొఖరా నుంచి జోమ్సమ్ నుంచి వెళ్తుండగా విమానం గల్లంతైంది. విమానం టేకాఫ్ తీసుకున్న 15నిమిషాలకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయని అధికార వర్గాలు తెలిపాయి. విమానం గల్లంతైన దగ్గర నుంచి ఆచూకీ కోసం వెతుకులాట ప్రారంభించారు. గల్లంతైన విమానాన్ని గుర్తించడానికి ఆర్మీ రంగంలోకి దిగింది. ఆదివారం సాయంత్రం వరకు గాలింపు నిర్వహించారు. మనపథి హిమాల్ పర్వత శ్రేణుల్లోని లమ్‌చే నది దగ్గర విమానం కూలిపోయినట్లు స్థానికులు చెప్పినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. భారీ శబ్ధం వినిపించిందని ఆ ప్రాంత ప్రజలు సమాచారం అందించారని ముస్టాంగ్ పోలీసులు తెలిపారు. గల్లంతైన విమానం ఆచూకీకోసం హోంశాఖ వెంటనే రెండు హెలికాప్టర్లను రంగంలోకి దించింది. ముస్టాంగ్, పొఖరా నుంచి ఇవి గాలింపు చర్యల్లో పాల్గొన్నాయి.
మరోవైపు నేపాల్ ఆర్మీ చాపర్ MI-17ను సైతం మోహరించింది. అయితే విమానం కూలిందని భావించిన ప్రదేశంలో మంచు కురవడంతో గాలింపు నిలిపివేశారు. తిరిగి సోమవారం తెల్లవారు జామున సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. దీంతో విమానం కూలిన ప్రదేశాన్ని గుర్తించిన ఆర్మీ అధికారులు అందుకు సంబంధించిన ఫొటోలను విడుదల చేశారు. అయితే విమాన శిథిలా పక్కనే పలు మృతదేహాలను గుర్తించినట్లు వారు తెలిపారు. విమాన ప్రమాదంలో అందరూ మరణించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు మరల తెలియజేస్తామని నేపాల్ ఆర్మీ ఉన్నతాధికారి బ్రిగేడియర్ జరనర్ నారాయణ్ సిల్వాల్ వెల్లడించారు.
Nepalese Sherpas Of The Rescue Team Wait For Other Colleagues As They Head To Search For The Remains Of The Tara Air Plane Crash
Family Members And Relatives Of Passengers Weep Outside Pokhara Airport