Planetary Parade : మహా అద్భుతంగా సాగుతున్న మహా కుంభమేళా.. వచ్చే శివరాత్రితో ముగియబోతోంది. అయితే ఆ శివరాత్రికి ఆకాశంలో అద్భుత ఖగోళ దృశ్యం గోచరింబచోతోంది. ఇప్పటిదాకా ఎవరూ ఇలాంటి దృశ్యాన్ని చూసి ఉండరని చాలా మంది చెబుతుండగా.. ఆ అరుదైన దృశ్యాన్ని, సన్నివేశాన్ని దర్శించేందుకు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతకీ ఏమిటా ఖగోళ దృశ్యం.. ఏంటి దాని ప్రత్యేకత?
నేలపైనే అతి పెద్ద ఆధ్యాత్మిక సంబరం కుంభమేళా. ఆ కుంభమేళాకి ఆఖరి రోజు ఈ శివరాత్రి. వచ్చే శివరాత్రి ప్రత్యేకత అంతా ఇంతా కాదు. ఇది 144 ఏళ్లకు ఒకసారి వచ్చిన ఘడియలుగా చెబుతున్నారు. శనిత్రయోదశి రోజు కూడా అదే దినం కావడంతో శివ భక్తులందరికీ ఇది చాలా విశిష్టత కలిగిన రోజుగా చెబుతున్నారు. అదొక్కటే కాదు.. ఆకాశంలోనూ మరో అద్భుతం జరగబోతోంది.
ఆ రోజున గ్రహాలన్నీ ఒకే వరుసలోకి రాబోతున్నాయి. ఆకాశంలో గ్రహకూటమి దర్శనమివ్వనుంది. నవ గ్రహాలన్నీ ఆకాశంలో కుంభమేళాకు ముగింపు పలకడానికి వస్తాయా అన్నట్లుగా ఒకే వరుసలోకి వస్తాయి. సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం సమయాల్లో సూర్యుడు, భూమి, చంద్రుడు ఒక వరుసలోకి వస్తాయి. అలా ఇప్పుడు శివరాత్రికి అన్ని గ్రహాలు ఒకే వరుసలోకి రావడమే అద్భుతం. ఇది కుంభమేళా కార్యక్రమానికి సరైన ముగింపునిచ్చే ఖగోళ దృశ్యంగా భావించవచ్చు.
Also Read : భూమిని ఢీకొట్టనున్న భారీ గ్రహశకలం.. డేంజర్‌లో ముంబై సిటీ.. అదే జరిగితే మహానగరం వినాశనమే..!
ఒకే వరుసలో కనిపించే ఏడు గ్రహాలలో ఐదు గ్రహాలు బుధుడు, శుక్రుడు, కుజుడు, బృహస్పతి, శని స్పష్టంగా కనబడతాయని శాస్త్రవేత్తలు చెబుతుండగా.. యురేనస్, నెప్ట్యూన్ మసకగా ఉండటం వల్ల బైనాకులర్లు లేదా టెలిస్కోప్ ల ద్వారా చూడొచ్చు.
ఈ అద్భుత దృశ్యాన్ని భారతీయులు సులువుగానే దర్శించవచ్చు. శివరాత్రి లింగోద్భవకాలం మనోళ్లకు ఒక విశిష్టమైన కాలం. ఆ సమయానికే ఇలా అరుదైన మహాకుంభమేళా ముగింపు, గ్రహ కూటమి దర్శనం అనేది ఒక అరుదైన అవకాశం. నమ్మే వారికైనా, నమ్మని వారికైనా.. ఇలాంటి దృశ్యాలు వన్స్ ఇన్ లైఫ్ టైమ్ అవకాశంగా చెప్పాలి.