G20 summit : జీ20 సదస్సులో మోడీతో రిషి సునక్ ముచ్చట్లు

జీ20 సదస్సులో ప్రధాని మోడీతో బ్రిటన్ ప్రధాని రిషి సునక్ మాటా మంతి ఫోటో సోషల్ మీడియాలో వైరల్.

G20 summit  బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ప్రధాని మోడీతో మాట్లాడుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇండోనేషియా రాజధాని బాలిలో జరుగుతున్న జీ20 సదస్సు బ్రిటన్ ప్రధాని భారత్ ప్రధాని ముచ్చట్లకు వేదిక అయ్యింది. బాలిలో జరుగుతున్న జీ 20 సదస్సుకు ఆయా సభ్య దేశాల అధినేతలు హాజరైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం (నవంబర్ 1,2022)ఉదయం జీ20 సదస్సు ప్రారంభమైంది. ఈ తొలి రోజునే వీరిద్దరి కలయిక జరిగింది. మోడీతో రిషి సునాక్ కలిసి మాట్లాడారు. ఇవి అధికారిక చర్చలు కావు. సరదా సరదా ముచ్చట్లు. ఈ సదస్సులో మోడీ కనిపించగానే రిషి సునాక్ స్వయంగా వచ్చి పలకరించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు కుశల ప్రశ్నలు వేసుకున్నారు.

కాగా జీ20 సదస్సులో ఆయా దేశాల అధినేతలతో మోడీ అధికారిక చర్చలు జరుపనున్నారు. దీంట్లో భాగంగా మోడీ భారత్, బ్రిటన్ దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు బుధవారం (నవంబర్ 16,2022) జరగనున్నాయి. ఈ చర్చల్లో తమ తమ దేశాల అధికార ప్రతినిధులతో కలిసి మోడీ, సునాక్ పాలుపంచుకోనున్నారు. ఈక్రమంలో ఒకే దేశానికి చెందిన నేతలు (రిషి సునక్ భారత సంతతికి చెందిన వ్యక్తి )కావడంతో వీరిద్దరూ తొలి రోజే తారసపడిన సందర్భంగా పలకరించుకున్నారు.

భారత సంతతికి చెందిన రిషి సునక్…భారత్ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణ మూర్తి అల్లుడు కూడా. ఈ కారణంగానే బ్రిటన్ ప్రధానిగా సునాక్ పదవీ బాధ్యతలు చేపట్టగానే…భారత్ ప్రజల హర్షం వ్యక్తం చేశారు. ఇక భారత్, బ్రిటన్ మధ్య సంబంధ బాంధవ్యాలు మరింత పెరగనున్నాయని ఆశాభావం వ్యక్తంచేశారు. రిషి సునక్ బ్రిటన్ ప్రధాని అయిన శుభ తరుణాన్ని యావత్ భారత్ అంతా సెలబ్రేట్ చేసుకుంది.

రిషి భారత్ సంతతికి చెందిన వ్యక్తి కావటం..భారతీయురాలినే వివాహం చేసుకోవటం వంటివాటితో పాటు భారతదేశాన్ని 200 ఏళ్లు పాలించిన బ్రిటన్ కు మన దేశానికి సంబంధించిన వ్యక్తే ప్రధాని కావటం వంటి పలు అంశాలు భారతీయుల్ని ఆనందం చెందేలా చేశాయి. ఈ క్రమంలో ఎంత తన దేశానికి (బ్రిటన్)దేశస్తుడైనా అతని మూలాలు భారత్ తోనే ముడిపడి ఉండటం వల్లనే భారత ప్రధాని మోడీని సునక్ స్వయంగా తానే ముందుకొచ్చి పలుకరించారని అనిపిస్తోంది.

 

ట్రెండింగ్ వార్తలు