Russia-Ukraine Conflict : అందరితో భారత్ స్నేహగీతం.. చైనా, పాకిస్తాన్‌కు చెక్ పెట్టే ప్లాన్..!

Russia-Ukraine Conflict : రెండు దేశాల మధ్య  వ్యాపారం, వాణిజ్యం, ఆర్థికం, సైనిక, ఇతర అవసరాల కోసం చేసుకునే ఒప్పంద స్నేహం. కానీ ఇండియా గత కొన్నేళ్లుగా ప్రపంచ దేశాలతో సమానమైన స్నేహాన్నే కొనసాగిస్తోంది. 

PM Modi repeats India stance, bats for diplomacy to end Russia-Ukraine war

Russia-Ukraine Conflict : నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు  ధన్యుడు సుమతీ.. అవును ఇండియా దౌత్య సంబంధాలను చూస్తే ప్రపంచ దేశాలకు ఇప్పుడు ఈ పద్యమే గుర్తుకొస్తోంది. అన్ని దేశాలది వ్యూహాత్మక దౌత్యం.. కానీ మనది మాత్రం వ్యూహాత్మక-స్నేహాత్మక దౌత్యం. ఎవరిపై ద్వేషం లేదు.. ఎవరూ శత్రువులూ కాదు.. అగ్రదేశాలతో స్నేహగీతం.. ప్రపంచం కూడా  భారత్‌ను విశ్వబంధువుగా భావించి గౌరవిస్తోంది. అందుకే ఏ దేశంలోనైనా అడుగు పెట్టగలుగుతోంది.  వారితో తమ దేశ విధానాలను నిక్కచ్చిగా చెప్పగలుగుతోంది.

Read Also : Russia-Ukraine Conflict : రష్యా, యు‎క్రెయిన్ అధ్యక్షులతో మోదీ శాంతి చర్చలు

దౌత్యం.. దీనికి డెఫినిషిన్‌ వేరు. రెండు దేశాల మధ్య  వ్యాపారం, వాణిజ్యం, ఆర్థికం, సైనిక, ఇతర అవసరాల కోసం చేసుకునే ఒప్పంద స్నేహం. కానీ ఇండియా గత కొన్నేళ్లుగా ప్రపంచ దేశాలతో సమానమైన స్నేహాన్నే కొనసాగిస్తోంది.  అమెరికా, రష్యా మధ్య పోటీ ఉంది. కానీ రెండు దేశాలతోనూ భారత్‌ వ్యాపార, వాణిజ్యసంబంధాలను దశాబ్దాలుగా క్లియర్‌కట్‌గా  కొనసాగిస్తోంది. కొన్ని దేశాలు అమెరికా అనగానే అగ్రరాజ్యం కదా.. అని వత్తాసు పలకాలంటాయి. కానీ ఇండియా అలా కాదు.. ఎవరికీ మేం దూరం కాదు.. ఎవరికీ మరీ దగ్గరా కాదు.. హుందాగా ఉన్న స్నేహబంధమే ముఖ్యమన్నట్లు వ్యవహరిస్తూ వస్తోంది.

ఆర్మీ యుద్ధవిమానాలు, హెలికాప్టర్లను రష్యా నుంచి కొన్న భారత్‌.. అమెరికా నుంచి కూడా రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకునేలా పలు ఒప్పందాలు చేసుకుంది.  ఇటు మోదీ యుక్రెయిన్‌ టూర్‌లో ఉండగానే అటు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ వాషింగ్టన్‌లో ఒప్పందాలు కూడా చేసుకోవడం.. ఇతర దేశాలతో మన దేశం అనుసరించే దౌత్య విధానానికి నిదర్శనం. అమెరికా టూర్‌లో 31 MQ-9B ప్రిడేటర్ డ్రోన్‌లను కొనుగోలు, స్ట్రైకర్ పదాతిదళ పోరాట వాహనాల ప్రతిపాదిత ఉమ్మడి తయారీ, భారత్‌లో GE F414 ఇంజిన్‌ల ఉత్పత్తి ఇలా పలు కీలకమైన ఒప్పంద  అంశాలు  చర్చకు వచ్చాయి.

చైనా, పాకిస్తాన్ రెండూ తమ సాయుధ డ్రోన్ నౌకలను బలోపేతం చేస్తున్నాయి. అదే సమయంలో అమెరికా నుంచి భారత్‌  31 (ముఫ్ఫైఒక్క) రిమోట్‌తో నడిచే సాయుధ MQ-9B హంటర్-కిల్లర్  విమానాలను తెప్పించుకుంటోంది.  ఈ ఏడాది నవంబర్-డిసెంబర్ నాటికి ఈ మెగా డీల్‌ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో అటు చైనాకు, ఇటు పాకిస్తాన్‌కు వాణిజ్యం, రక్షణరంగ పరంగా కూడా చెక్‌ పెట్టొచ్చనేది ఇండియా వ్యూహం.

చైనా తన సాయుధ కై హాంగ్-4 .. వింగ్ లూంగ్-II డ్రోన్‌ల సరఫరాను పాకిస్తాన్‌కు పెంచింది. దీంతో భారత్ కూడా అప్రమత్తమై రక్షణ, సైనిక అవసరాలకు తన బలాన్ని పెంచుకునే పనిలో ఉంది. MQ-9B ప్రిడేటర్ డ్రోన్ 40 వేల అడుగుల ఎత్తులో దాదాపు 40 గంటల పాటు ప్రయాణించేలా రూపొందించబడింది. వీటిలో హెల్‌ఫైర్ ఎయిర్-టు గ్రౌండ్ క్షిపణులు, ఖచ్చితమైన దాడుల కోసం స్మార్ట్ బాంబులు అమర్చుతారు. ఇవి చైనా డ్రోన్లకంటే చాలా పవర్‌ఫుల్‌ . అమెరికాతో ఈ డీల్‌ ఇప్పటికే  చివరి దశకు వచ్చింది.

ద్వైపాక్షిక సంబంధాలంటూ కేవలం వెస్ట్రన్‌ దేశాలపైనే భారత్‌ ఆధారపడదు.  వెస్ట్ ఏషియా దేశాలతోనూ వాణిజ్యం, ఇతర అంశాలపై  బలమైన స్నేహబంధాన్ని కొనసాగిస్తోంది ఇండియా. ఇంధన అవసరాలకు  సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్‌తో డిప్లమసీ చేస్తోంది. మన దేశం నుంచి ఎన్నో వస్తువులు ఈ దేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది.

యుద్ధం మంచిది కాదని ఇజ్రాయెల్‌తో చెబుతుంది. అదే సమయంలో  ఇతర సాంకేతిక  అవసరాలకు ఆ దేశంతో ఒప్పందాలెన్నో చేసుకుంటుంది. ఇరాక్‌, ఇరాన్‌లకు శాంతిమంత్రం వేస్తూనే.. చాబహార్‌ పోర్ట్‌ నిర్వహణకు సంబంధించిన కీలకమైన ఒప్పందం కూడా కుదుర్చుకుంది. అలా పశ్చిమాసియా దేశాలకు భారత్‌ బాగా దగ్గరయ్యింది.

Read Also : India Ringmaster : రింగ్ మాస్టర్ ఇండియా.. రష్యా-యుక్రెయిన్‌ యుద్ధాన్ని మోదీ ఒక్కరు ఆపగలరా..?

ట్రెండింగ్ వార్తలు