India Ringmaster : రింగ్ మాస్టర్ ఇండియా.. రష్యా-యుక్రెయిన్ యుద్ధాన్ని మోదీ ఒక్కరు ఆపగలరా..?
India Ringmaster : యుద్ధం.. అది మిగిల్చే విషాదం .. దాన్ని మాటలకు వర్ణించలేం. ప్రస్తుతం రష్యా-యుక్రెయిన్‌ది అదే పరిస్థితి. ఒకరు వెనకడుగు వేయరు.. ఇంకొకరు వెనక్కి తగ్గేదేలేదంటారు. కానీ బలవుతోంది మాత్రం ప్రజలు, సైనికులు.

Russia-Ukraine Conflict Resolution
India Ringmaster : రష్యా-యుక్రెయిన్ యుద్ధాన్ని మోదీ ఒక్కరు ఒంటి చేత్తో ఆపగలరా..? ఇదంతా జరిగే పనేనా..? ఇలా ప్రపంచవ్యాప్తంగా రకరకాల వాదనలు. నిజానికి రెండు దేశాలు యుద్ధంలో పీకల్లోతు మునిగిపోయాయి. ఇరువైపులా చెప్పుకోలేనంతగా తీవ్రమైన నష్టం వాటిల్లింది.
పైగా వాటికి ఏదో ఒక పక్కన చేరి ఆయుధాలు, ఆర్థికసాయం అందిస్తూ కొట్టుకుచావండని ఎంకరేజ్ చేసే దేశాలే అన్నీ. కానీ భారత్ అలా చేయలేదు. అందరూ బాగుండాలి.. అందులో మనముండాలన్నట్లు.. మధ్యవర్తిత్వం చేసేందుకు ముందడుగు వేసింది. కోపంతో రగులుతున్న కళ్లలో శాంతి, కరుణ చూడాలని ఆలోచిస్తోంది. అది సక్సెస్సవుతుందా..? ఫెయిలవుతుందా..? అనేది తర్వాత.. కనీసం ఆదిశగా ప్రయత్నమైనా చేస్తున్నారు ప్రధాని మోదీ.
Read Also : Anil Ambani : అనిల్ అంబానీకి సెబీ షాక్.. ఐదేళ్ల పాటు నిషేధం.. రూ. 25 కోట్ల జరిమానా..!
యుద్ధం.. అది మిగిల్చే విషాదం .. దాన్ని మాటలకు వర్ణించలేం. ప్రస్తుతం రష్యా-యుక్రెయిన్‌ది అదే పరిస్థితి. ఒకరు వెనకడుగు వేయరు.. ఇంకొకరు వెనక్కి తగ్గేదేలేదంటారు. కానీ బలవుతోంది మాత్రం ప్రజలు, సైనికులు. ఈ జనరేషన్ ఎప్పుడూ చూడని యుద్ధవిధ్వంసాన్ని అటు రష్యా-యుక్రెయిన్ , ఇటు పాలస్తీనా , ఇజ్రాయెల్ చవి చూశాయి. ఇవి మెల్లగా ప్రచ్ఛన్న యుద్ధంగా ఆవిర్భవిస్తుందేమోనన్న అనుమానాలు పీక్స్‌కు చేరాయి. అలాంటి సమయంలో భారత్ ఐక్యరాజ్యసమితి నుంచి.. జీ20 సదస్సు, జీ7 సమ్మిట్ వరకు అడుగడుగునా శాంతి కోసమే పరితపిస్తూ వచ్చింది.
2022లో మొదలైన యుద్ధం.. ఇంకా కొనసాగుతోంది. ఎవరి స్వార్థప్రయోజనాల కోసం వాళ్లు ఆయా దేశాల జట్లలో చేరిపోయారు. కానీ.. భారత్ అలా చేయలేదు. తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని తేటతెల్లం చేసింది. వార్ వల్ల ఆస్తి, ప్రాణనష్టం తప్పితే అభివృద్ధి ఉండదని.. కోలుకోవడం కష్టమని స్పష్టం చేసింది.
యుద్ధాన్ని ఆపాలనే ఉక్రెయిన్ అధ్యక్షుడిని 2023 మేలో జపాన్‌లో జరిగిన G-7 శిఖరాగ్ర సమావేశంలో మోదీ జెలెన్‌స్కీని తొలిసారి కలిసినప్పుడు చెప్పారు. రష్యా, యుక్రెయిన్ యుద్ధం మొదలైనప్పట్నుంచి.. ఇప్పటివరకు నాటో దేశాలు తప్ప మరే ఇతర దేశం కూడా యుక్రెయిన్‌లో పర్యటించలేదు. ఆ విధంగా చూస్తే మోదీ వేసిన ముందడుగు ఎంతో ప్రత్యేకమైందనేది అంతర్జాతీయ రాజకీయాలను విశ్లేషిస్తున్నవాళ్లు చెబుతున్నమాట.
మోదీ యుక్రెయిన్ పర్యటనపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ పర్యటనతో యుద్ధం ముగుస్తుందని ఆశిస్తున్నట్లు భావిస్తున్నామన్నారు. చాలా మంది దేశాధినేతలు, ప్రభుత్వాధినేతలు ఉక్రెయిన్ వెళ్లారు. కానీ భారత ప్రధాని టూర్ ఘర్షణకు ముగింపు పలకాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు.. మోదీ పర్యటనతో ఎంతోకొంత మార్పును ఆశించొచ్చని ప్రపంచదేశాలు కూడా ఎదురుచూస్తున్నాయని.
యుక్రెయిన్ టూర్‌కు ముందు నుంచే ఆ దేశాన్ని యుద్ధం విరమించమని సూచించేలా సంకేతాలు పంపుతూ వచ్చారు భారత ప్రధాని. యుక్రెయిన్ కంటే ముందు పోలాండ్‌లో పర్యటించారు. అక్కడ కూడా మోదీ శాంతి, స్థిరత్వం, దౌత్యం, స్నేహంపైనే ఎక్కువగా మాట్లాడారు. సంక్షోభ సమయంలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం మొత్తం మానవ జాతికే పెద్ద సవాలుగా మారుతోందన్నారు. తాము శాంతి, స్నేహం కోసం ఎవరితోనైనా చర్చలకు మద్దతిస్తున్నామని స్పష్టం చేశారు.
యుద్ధభూమిలో ఏ సమస్యకూ పరిష్కారం ఉండదని తాము బలంగా విశ్వసిస్తున్నామన్నారు. ఇటు పోలాండ్‌తో బలమైన సంబంధాలను కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. అదే సమయంలో వ్యాపార, ఇతర వాణిజ్య, ఆర్థిక సంబంధాలపైనా చర్చించారు. మేకిన్ ఇండియా, మేక్ ఫర్ వరల్డ్ నినాదం వినిపించారు. కలిసి నడుస్తూ.. పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని ఆకాంక్షించారు.
Read Also : Russia-Ukraine Conflict : రష్యా, యుక్రెయిన్ అధ్యక్షులతో మోదీ శాంతి చర్చలు