PM Modi
PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ వీడియోను పోస్టు చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియోలో మోదీ తన నివాసంలో ఆవు దూడతో కనిపించారు. లోక్ కల్యాణ్ మార్గ్ లోని ప్రధాని నివాసంలో లేగ దూడకు ఆవు జన్మనిచ్చింది. దానిని ప్రధాని ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించారు. అంతేకాదు.. తిలకం పూసి పూలమాల వేశారు. ఒళ్లో కూర్చోబెట్టుకొని ముద్దాడారు. దానికి దీప్ జ్యోతి అని పేరు పెట్టినట్లు మోదీ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.
Also Read : Bangladesh Hilsa : బెంగాలీలకు బంగ్లాదేశ్ షాక్.. క్షమించండి.. ఈ దుర్గా పూజకు ‘హిల్సా’ను పంపలేం..!
ప్రధాని మోదీ ఎక్స్ ఖాతాలో ఇలా రాశారు.. మన గ్రంథాలలో ‘గావ్ సర్వసుఖ ప్రద’ అని చెప్పబడింది. లోక్ కల్యాణ్ మార్గ్ లోని ప్రధానమంత్రి హౌసింగ్ ఫ్యామిలీలో కొత్త సభ్యుడు శుభప్రదమైన రాక జరిగింది. ప్రధాన మంత్రి నివాసంలో ప్రియమైన తల్లి ఆవుకు కొత్త దూడ జన్మించింది. దాని నుదిటిపై కాంతి గుర్తు ఉంది. అందుకే దానికి ‘దీప్జ్యోతి’ అని పేరు పెట్టాను అని మోదీ పేర్కొన్నారు.
Also Read : Megha Akash : పెళ్లి పనులు మొదలుపెట్టిన హీరోయిన్.. ఘనంగా మెహందీ వేడుక..
మకర సంక్రాంతి సందర్భంగా కూడా ప్రధాని మోదీ గోవులకు ఆహారం తినిపిస్తున్న వీడియో విడుదలైంది. ప్రధాని నివాసంలో చాలా ఆవులు ఉన్నాయి. మోదీ తరచుగా వాటితో గడుపుతారు. ఇవి సాధారణ ఆవు కంటే కొంచెం భిన్నంగా ఉంటాయి. ప్రధాని మోదీ నివాసంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుంగనూరు జాతికి చెందిన ఆవులు ఉన్నాయి. వాటి ఎత్తు రెండున్నర నుంచి మూడు అడుగులు మాత్రమే. ఆ ఆవు అత్యంత పోషకమైన పాలు ఇస్తుంది.
हमारे शास्त्रों में कहा गया है – गाव: सर्वसुख प्रदा:’।
लोक कल्याण मार्ग पर प्रधानमंत्री आवास परिवार में एक नए सदस्य का शुभ आगमन हुआ है।
प्रधानमंत्री आवास में प्रिय गौ माता ने एक नव वत्सा को जन्म दिया है, जिसके मस्तक पर ज्योति का चिह्न है।
इसलिए, मैंने इसका नाम ‘दीपज्योति’… pic.twitter.com/NhAJ4DDq8K
— Narendra Modi (@narendramodi) September 14, 2024