UK PM Rishi Sunak : యూకేలో త్వరలో సిగరెట్లపై నిషేధాస్త్రం…ప్రధాని రిషి సునక్ యోచన

బ్రిటన్ దేశంలో త్వరలో సిగరెట్లపై నిషేధాస్త్రం విధించనున్నారు. బ్రిటీష్ ప్రధాన మంత్రి రిషి సునక్ తదుపరి తరం సిగరెట్లను కొనుగోలు చేయకుండా నిషేధించే చర్యలను ప్రవేశపెట్టడాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి....

ban cigarettes

UK PM Rishi Sunak : బ్రిటన్ దేశంలో త్వరలో సిగరెట్లపై నిషేధాస్త్రం విధించనున్నారు. బ్రిటీష్ ప్రధాన మంత్రి రిషి సునక్ తదుపరి తరం సిగరెట్లను కొనుగోలు చేయకుండా నిషేధించే చర్యలను ప్రవేశపెట్టడాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గతేడాది న్యూజిలాండ్ ప్రకటించిన చట్టాల మాదిరిగానే ధూమపాన నిరోధక చర్యలను సునక్ పరిశీలిస్తున్నారు. (UK PM Rishi Sunak)

Telangana Rain : తెలంగాణకు భారీ వర్ష సూచన.. రెండు రోజులు కుమ్ముడే, హైదరాబాద్‌తో పాటు 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్

2009 వ సంవత్సరం జనవరి 1వతేదీ లేదా ఆ తర్వాత జన్మించిన వారికి పొగాకు అమ్మడంపై నిషేధం విధిస్తూ గత సంవత్సరం న్యూజిలాండ్ చట్టం చేసింది. ఆ చట్టాల మాదిరిగానే సునక్ ధూమపాన నిరోధక చర్యలను పరిశీలిస్తున్నారు. (may ban cigarettes) ‘‘2030 నాటికి ధూమపాన రహితంగా ఉండాలనే మా ఆశయాన్ని అమలు చేయాలనుకుంటున్నాం’’ అని బ్రిటిష్ ప్రభుత్వ ప్రతినిధి పేర్కొన్నారు.

Mynampally Hanumantha Rao : బీఆర్ఎస్‌కు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రాజీనామా, త్వరలో కాంగ్రెస్‌లో చేరే ఛాన్స్..!

ఉచిత వేప్ కిట్‌ల పంపిణీ, గర్భిణీ స్త్రీలు ధూమపానం చేయకుండా ప్రోత్సహించేలా వోచర్ పథకం అమలుకు సంప్రదింపులు జరుపుతున్నామని యూకే ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికలకు ముందు సునాక్ బృందం ధూమపాన నిషేధానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.

Sidharth Luthra : చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేత, సీఐడీ కస్టడీకి అనుమతి తర్వాత.. సిద్ధార్ధ లూథ్రా మరో ఆసక్తికర ట్వీట్

ఇ-సిగరెట్లపై నియంత్రణకు వీలుగా పిల్లలకు ఉచితంగా వేప్‌ల నమూనాలను రిటైలర్లు అందించకుండా చర్యలు తీసుకుంటామని మే నెలలో బ్రిటన్ ప్రకటించింది. జులై నెలలో ఇంగ్లాండ్, వేల్స్‌లోని కౌన్సిల్‌లు పర్యావరణ, ఆరోగ్య కారణాలపై 2024 నాటికి సింగిల్ యూజ్ వేప్‌ల అమ్మకాన్ని నిషేధించాలని ప్రభుత్వాన్ని కోరాయి.