Telangana Rain : తెలంగాణకు భారీ వర్ష సూచన.. రెండు రోజులు కుమ్ముడే, హైదరాబాద్‌తో పాటు 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులతో భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. Telangana Rain Alert

Telangana Rain : తెలంగాణకు భారీ వర్ష సూచన.. రెండు రోజులు కుమ్ముడే, హైదరాబాద్‌తో పాటు 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్

Telangana Rain

Updated On : September 23, 2023 / 1:19 AM IST

Telangana Rain Alert : తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు దంచికొట్టనున్నాయి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో రెండు రోజులు తెలంగాణ వ్యాప్తంగా భారీ వానలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని ఉత్తర, తూర్పు జిల్లాలలో కుండపోత వానలు పడతాయని తెలిపింది.

హైదరాబాద్ తో పాటు 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులతో భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

Also Read..Epuri Somanna: షర్మిలకు షాక్.. బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న ఏపూరి సోమన్న.. కేటీఆర్‌తో..

”ఉపరితల ఆవర్తనం జార్ఖండ్ నుంచి తెలంగాణ వరకు విస్తరించి ఉంది. ఛత్తీస్ గడ్, విదర్భ ప్రాంతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం సూచన కూడా ఉంది. ఈ రెండు రోజులు కూడా రాష్ట్రం అంతటా వానలు పడనున్నాయి. ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జైశంకర్ భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి, నిజామాబాద్, ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి.

Also Read..Dubbak: దుబ్బాక బరిలో నిలుస్తున్న అభ్యర్థులెవరు.. ట్రయాంగిల్ ఫైట్ విజేత ఎవరు?

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పగటిపూట వాతావరణం మేఘావృతమై ఉంటుంది. రాత్రికి కొద్దిగా జల్లులు కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల భారీ జల్లులుగా మారే అవకాశం ఉంది. రేపటి వరకు చూసుకున్నట్లు అయితే ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలతో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో ఇవాళ అంతా వాతావరణం మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం 7 గంటల తర్వాత కొద్దిగా జల్లులు పడతాయి. భారీ జల్లులుగా మారే అవకాశం ఉంది. ఈ ఎల్లో అలర్ట్ తెలంగాణ రాష్ట్రం మొత్తం రోజులు మాత్రమే ఉంది’ అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారిణి శ్రావణి తెలిపారు.