Epuri Somanna: షర్మిలకు షాక్.. బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న ఏపూరి సోమన్న.. కేటీఆర్‌తో..

ఈ సమావేశంలో ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, సీనియర్ నాయకుడు దాసోజు శ్రవణ్ కూడా పాల్గొన్నారు.

Epuri Somanna: షర్మిలకు షాక్.. బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న ఏపూరి సోమన్న.. కేటీఆర్‌తో..

Epuri somanna Meets KTR

Updated On : September 22, 2023 / 5:54 PM IST

Epuri Somanna – KTR: వైఎస్సార్టీపీ (YSRTP) నేత ఏపూరి సోమన్న పార్టీ మారనున్నారు. త్వరలో ఆయన బీఆర్ఎస్ (BRS) పార్టీలో చేరనున్నట్లు తెలిసింది. తెలంగాణ మంత్రి కేటీఆర్ తో ఏపూరి సోమన్న మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు సమాచారం.

ఏపూరి సోమన్న నిర్ణయాన్ని కేటీఆర్ స్వాగతించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, సీనియర్ నాయకుడు దాసోజు శ్రవణ్ కూడా పాల్గొన్నారు. షర్మిల వైఎస్సార్టీపీని స్థాపించినప్పటి నుంచి ఆ పార్టీలో ఆయన కీలక నేతగా ఉన్న విషయం తెలిసిందే.

తుంగతుర్తి ఎమ్మెల్యేగా తాను వైఎస్సార్టీపీ నుంచి పోటీ చేస్తానని గతంలో చెప్పారు. షర్మిల తన వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారని ప్రచారం జరుగుతోంది. షర్మిల పార్టీలో చేరకముందు ఏపూరి సోమన్న కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. ఏపూరి సోమన్న ప్రజాగాయకుడు. ఆయనకు తెలంగాణలో భారీగా అభిమానులు ఉన్నారు.

Ys Sharmila: కుంభకర్ణుడి అసలైన వారసులు మీరు: వైఎస్ షర్మిల