×
Ad

Ban On Burqas: బుర్ఖాలు, నిఖాబ్‌లపై నిషేధం.. జైలుశిక్ష, జరిమానా కూడా.. పోర్చుగల్ సంచలన నిర్ణయం..

ఇప్పటికే పూర్తి లేదా పాక్షిక నిషేధాలు ఉన్న ఫ్రాన్స్, ఆస్ట్రియా, బెల్జియం, నెదర్లాండ్స్‌తో సహా యూరోపియన్ దేశాల సరసన పోర్చుగల్‌ నిలుస్తుంది.

Ban On Burqas: పోర్చుగీస్ పార్లమెంట్ కొత్త చట్టాన్ని ఆమోదించింది. బహిరంగ ప్రదేశాల్లో బుర్ఖాలు, నిఖాబ్‌లు ధరించడాన్ని నిషేధిస్తూ చట్టం తెచ్చింది. ఈ బిల్లును రైట్ వింగ్ పార్టీ చెగా ప్రవేశపెట్టింది.

బురఖా ధరిస్తే ఎంత జరిమానా వేస్తారంటే?
ఈ చట్టం ప్రకారం, బహిరంగ ప్రదేశాల్లో బురఖా లేదా నిఖాబ్ ధరిస్తే 20వేల రూపాయల నుండి 4 లక్షల రూపాయల వరకు జరిమానా విధించవచ్చు. ఇంకా, ఎవరైనా బురఖా ధరించమని బలవంతం చేయడానికి ప్రయత్నిస్తే మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చు.

ఇప్పటికే ఫ్రాన్స్, ఆస్ట్రియా, బెల్జియం, నెదర్లాండ్స్‌తో సహా యూరోపియన్ దేశాల్లో బుర్ఖాలపై పూర్తి లేదా పాక్షిక నిషేధాలు ఉన్నాయి. ఇప్పుడు వాటి సరసన పోర్చుగల్‌ నిలుస్తుంది.

ఇక్కడ మాత్రమే బుర్ఖాకు అనుమతి..
విమానాలు, మతపరమైన ప్రదేశాలు, రాయబార కార్యాలయాలలో బుర్ఖాలు ధరించడానికి అనుమతి ఉంది. అధ్యక్షుడు మార్సెలో రెబెలో డి సౌసా ఇంకా బిల్లుపై సంతకం చేయలేదు. దీనిని ఆయన నిరోధించవచ్చు లేదా దర్యాప్తు కోసం కోర్టుకు సూచించవచ్చు.

పార్లమెంటరీ చర్చ సందర్భంగా, కొంతమంది వామపక్ష మహిళా ఎంపీలు ఈ నియమాన్ని వ్యతిరేకించారు. చెగా పార్టీ నాయకుడు ఆండ్రీ వెంచురాతో వాదించారు. కానీ ఇతర మితవాద పార్టీల మద్దతుతో బిల్లు ఆమోదించబడింది. ‘ఈ నియమం పురుషులు, స్త్రీల మధ్య సమానత్వం కోసం. ఎవరూ తమ ముఖాలను కప్పుకోవాలని బలవంతం చేయకూడదు” అని అధికార పార్టీ ఎంపీ ఆండ్రియా నెటో అన్నారు.

Also Read: అట్టుడుకుతున్న అమెరికా.. ట్రంప్‌నకు వ్యతిరేకంగా రోడ్లపైకొచ్చి నిరసన తెలుపుతున్న ప్రజలు.. ఎందుకంటే?