‘Psychic Therapy’ To Reduce Anxiety : ‘సజీవంగా పాతిపెట్టి’ డిప్రెషన్‌కు చికిత్స .. మానసిక రోగుల్ని సామూహికంగా ఖననం చేసిన సంస్థ..రూ.లక్షల్లో ఫీజు వసూళ్లు
సాధారణంగా మనిషి డిప్రెషన్‌లోకి వెళ్తే ఏం చేస్తాం.. వాళ్లతో మాట్లాడటం డాక్టర్ దగ్గర ట్రీట్‌మెంట్ ఇప్పించడం వంటివి చేస్తుంటాం.. కాని రష్యాలో అయితే ఈ సమస్యతో బాధపడేవారిని.. బతికుండగానే సమాధిలో పాతేస్తామంటున్నారు. అంతేకాదు అలా సమాధి చేయడానికి వందలు కాదు వేలు కాదు ఏకంగా లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు..

‘Psychic Therapy’ To Reduce Anxiety
‘Psychic Therapy’ To Reduce Anxiety : సాధారణంగా మనిషి డిప్రెషన్‌లోకి వెళ్తే ఏం చేస్తాం.. వాళ్లతో మాట్లాడటం డాక్టర్ దగ్గర ట్రీట్‌మెంట్ ఇప్పించడం వంటివి చేస్తుంటాం.. కాని రష్యాలో అయితే ఈ సమస్యతో బాధపడేవారిని.. బతికుండగానే సమాధిలో పాతేస్తామంటున్నారు. అంతేకాదు అలా సమాధి చేయడానికి వందలు కాదు వేలు కాదు ఏకంగా లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు..
ఈ రోజుల్లో చాలా మందికి డిప్రెషన్, ఒత్తిడి వంటి సమస్యలు వస్తున్నాయి. యాంగ్జైటీతో బాధపడుతున్నవారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకీ పెరుగుతోంది. చాలా మంది ఈ సమస్యను తమలోనే అణిచివేసుకుని పోరాడుతూనే ఉన్నారు. మానసిక వైద్యులు, కౌన్సిలర్ల చుట్టూ తిరుగుతున్నారు. తగ్గించుకునేందుక రకాల చికిత్సలు, మందులను ఉపయోగిస్తున్నారు. అయితే ఇలాంటి సమస్యలకు అద్భుతమైన మందు మా వద్ద ఉందంటూ రష్యన్ కంపెనీ ఓ డిఫరెంట్ టెక్నిక్‌తో ముందుకొచ్చింది.
డిప్రెషన్ సమస్యకు పూర్తిస్థాయిలో చెక్ పెడతామని చెబుతూ.. విభిన్న ఆలోచన చేసింది రష్యా కంపెనీ. సాధారణంగా అయితే చనిపోయిన వ్యక్తిని సమాధిలో పాతిపెడతారు. కాని తాము బతికుండగానే సమాధి చేసి చికిత్స చేస్తామంటోంది కంపెనీ. అంత్యక్రియల అనుభూతిని కల్పించేందుకు బతికుండగానే ఖననం చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక ప్యాకేజీలు కూడా ప్రకటించారు.
రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని ప్రీకేటెడ్ అకాడమీ అనే సంస్థ ద్వారా ప్రజలకు ఒక గంట పాటు సజీవంగా సమాధి చేసిన అనుభవాన్ని అందించారు. ఈ సమయంలో అంత్యక్రియలకు ఎలాగైతే ఏర్పాట్లు చేస్తామో అలాగే అక్కడి వాతావరణం మొత్తం సిద్ధం చేశారు. పేషెంట్లను సామూహికంగా ఖననం చేశారు. కొంత సమయం తర్వాత వారిని తిరిగి బయటకు తీశారు. ఈ థెరపీ ద్వారా భయం, ఒత్తిడిని అధిగమించవచ్చని.. ఆందోళనతో బాధపడేవారికి ఉపశమనం లభిస్తుందని చెబుతోంది కంపెనీ..
ఈ ట్రీట్‌మెంట్‌లో మనక్కావాల్సినవన్నీ చేసుకోవచ్చు. చికిత్స సమయంలో సంగీతం వినడం, కొవ్వొత్తులను వెలిగించే అవకాశం కూడా కల్పిస్తారు. అంతేకాదు వర్చువల్ వీలునామా రాసే ఛాన్స్ కూడా కల్పించింది కంపెనీ. ఈ థెరపీ పూర్తిగా సేఫ్ అని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ థెరపీకి అయ్యే ఖర్చు వింటే ఆశ్చర్యపోవాల్సిందే.. ప్రస్తుతం దీని ధర 47 లక్షలు.. ఇంత పే చేస్తున్నాం.. రోజంతా సమాధిలోనే ఉండొచ్చు అనుకుంటున్నారేమో.. కాదు కేవలం గంట పాటు మాత్రమే సమాధిలో ఉంచి చికిత్స అందిస్తారు. ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ప్యాకేజీలు సపరేట్‌గా అందిస్తోంది కంపెనీ..