Putin Photo Published Rape Accused
Putin photo published rape accused : పొరపాట్లు ఎవరికైనా జరుగుతాయి. కానీ అత్యాచారం చేసిన నిందితుడి ఫొటో బదులుగా ఏకంగా ఓ దేశాధ్యక్షుడి ఫోటో ప్రచురించిన పొరపాటు మాత్రం చాలా విచారకరమనే చెప్పాలి. అటువంటి తప్పిదమే జరిగింది ఓ నేషనల్ పత్రిక చేసిన పొరపాటులో. ముంబయిలో ఓ నేషనల్ పత్రిక చేసిన ఈ ఘోర తప్పిదం ఫలితంగా ఏకంగా అత్యాచారం చేసిన నిందితుడి ఫోటోకు బదులుగా ఏకంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫొటో ప్రచురించిన ఘటన జరిగింది.
ముంబయికు చెందిన 28 ఏళ్ల పాత్రికేయుడు వరుణ్ హిరేమఠ్ పై అత్యాచార ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుకు సంబంధించిన వార్తను ఓ నేషనల్ డైలీ న్యూస్ పేపర్ ఏప్రిల్ 6 ఎడిషన్ లో ప్రచురించింది. అత్యాచారం నిందుతుడు వరుణ్ హిరేమఠ్ ఫొటోకు బదులు ఏకంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫొటో ప్రచురించింది సదరు పత్రిక. దాంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ రేంజిలో విరుచుకుపడ్డారు ఆ పేపర్ పైన.
ఇటువంటి ఘోర తప్పిదం చేసిన సదరు పత్రికా యాజమాన్యం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ లు వెల్లువెత్తుతున్నాయి. అత్యాచార కేసులో నిందితుడైన 28 ఏళ్ల వరుణ్ హిరేమఠ్ కు ఢిల్లీ న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన వార్త ప్రచురణలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోటో ప్రచురించి తప్పిదానికి పాల్పడ్డారు పత్రిక నిర్వాహకులు.