Russia Ukraine War: యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో మాట్లాడనున్న ప్రధాని మోదీ..?

రష్యా యుక్రెయిన్ యుద్ధం నేపధ్యంలో ఇవాళ కీలక పరిణామాలు చోటు చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. యుక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయుల తరలింపుపై.. ప్రధాని మోదీ రంగంలోకి దిగుతున్నారు.

Russia Ukraine War: రష్యా యుక్రెయిన్ యుద్ధం నేపధ్యంలో.. ఇవాళ కీలక పరిణామాలు చోటు చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. యుక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను తరలించడం పూర్తి కాని విషయంపై.. నేరుగా ప్రధాని మోదీ రంగంలోకి దిగనున్నారు. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తో ఆయన కాసేపట్లో మాట్లాడనున్నారు. సుమి ప్రాంతంలో చిక్కుకున్న భారతీయులను తరలించడం గురించి చర్చించనున్నట్టు ఢిల్లీ వర్గాలంటున్నాయి.

ఇప్పటికే.. యుక్రెయిన్ నుంచి వేలాది మంది భారతీయులను కేంద్రం తరలించింది. ఆపరేషన్ గంగ పేరుతో.. పదుల సంఖ్యలో విమానాలను పంపించి.. మన దేశానికి చెందిన వారిని క్షేమంగా తీసుకువస్తోంది. ఇంత జరిగినా.. ఇప్పటికీ యుక్రెయిన్ లోనే వేలాది మంది భారతీయులు బిక్కుబిక్కుమంటూ ప్రాణ భయంతో వణికిపోతున్నారు. తిండి లేక.. తాగడానికి నీళ్లు లేక.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని క్షణమొక యుగంగా కాలం వెళ్లదీస్తున్నారు.

Read More: Russia Ukraine war: సలాం ఇండియన్ ఆర్మీ.. సేఫ్‌గా భారత్ చేరిన స్టూడెంట్స్

ఈ క్రమంలో.. ఇప్పటికే.. కర్ణాటకకు చెందిన ఓ విద్యార్థి.. రష్యన్ మిస్సైల్ కు బలయ్యాడు. మరో భారతీయ విద్యార్థి.. ప్రాణాలు కాపాడుకునే క్రమంలో యుద్ధ తూటాలకు గాయపడ్డాడు. ఈ విషయంపై ఇప్పటికే స్పందించిన కేంద్రం.. అటు రష్యాతోనూ.. ఇటు యుక్రెయిన్ తోనూ సంప్రదింపులు చేసింది. భారతీయులను క్షేమంగా తరలించడంపై తగిన చర్యలు తీసుకుంది.

Read More: Russia ukraine war : యుక్రెయిన్ నుంచి వచ్చిన భార‌తీయుల‌కు అరుదైన స్వాగ‌తం పలికిన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ

ఇప్పుడు.. ప్రధాని మోదీ నేరుగా రంగంలోకి దిగి.. జెలెన్ స్కీ తో మాట్లాడనుండడం.. ప్రాధాన్యత సంతరించుకుంది. మోదీ ఏం మాట్లాడనున్నారు.. జెలెన్ స్కీ ఏం చెప్పనున్నారు.. ఇరు దేశాధినేతల చర్చలు.. యుద్ధంపై ప్రభావం చూపిస్తాయా.. ఉద్రిక్తతలను తగ్గిస్తాయా.. యుక్రెయిన్ లోని భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చే దిశగా సరైన ఫలితాన్నిస్తాయా.. అన్నది చూడాల్సి ఉంది.

Read More: Russia Ukraine War: యుద్ధం అక్కడ.. చమురు బాంబులు ఇక్కడ

ట్రెండింగ్ వార్తలు