Shanghai Cooperation Organisation: పాక్, చైనా, రష్యా అధ్యక్షులతో కలిసి ఒకే వేదికపై ప్రధాని మోదీ

షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సభ్య దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌కండ్‌ వెళ్లారు. ఆయనకు ఉజ్బెకిస్థాన్‌ అధ్యక్షుడు షావ్కత్ మిర్జియోయేవ్ స్వాగతం పలికారు. షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల శిఖరాగ్ర సదస్సు వేదికపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఉజ్బెకిస్థాన్‌ అధ్యక్షుడు షావ్కత్ మిర్జియోయేవ్ తో పాటు పాటు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఇతర నేతలు ఫొటో దిగారు.

Shanghai Cooperation Organisation: షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సభ్య దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌కండ్‌ వెళ్లారు. ఆయనకు ఉజ్బెకిస్థాన్‌ అధ్యక్షుడు షావ్కత్ మిర్జియోయేవ్ స్వాగతం పలికారు. షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల శిఖరాగ్ర సదస్సు వేదికపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఉజ్బెకిస్థాన్‌ అధ్యక్షుడు షావ్కత్ మిర్జియోయేవ్ తో పాటు పాటు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఇతర నేతలు ఫొటో దిగారు.

ఎస్‌సీవో సభ్య దేశాల శిఖరాగ్ర సదస్సులో ప్రాంతీయ సమస్యలతో పాటు అంతర్జాతీయ అంశాలు చర్చించనున్నారు. షాంఘై సహకార సంస్థ 2001లో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో ఎనిమిది పూర్తిస్థాయి సభ్య దేశాలుగా చైనా, రష్యా, భారత్ తో పాటు కజకిస్థాన్‌, కిర్గిజిస్థాన్‌, తజికిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, పాకిస్థాన్‌లు కొనసాగుతున్నాయి.

మోదీ-జిన్ పింగ్, మోదీ-పుతిన్ ద్వైపాక్షిక చర్చలు కూడా జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మోదీ, తమ దేశ అధ్యక్షుడు పుతిన్‌ మధ్య చర్చలు జరుగుతాయని రష్యా ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. వ్యూహాత్మక స్థిరత్వంతో పాటు ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలోని సమస్యలు వంటి అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది.

Corona cases: దేశంలో కొత్తగా 6,298 కరోనా కేసులు నమోదు.. నిన్న కోలుకున్న 5,916 మంది

ట్రెండింగ్ వార్తలు