Video: జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు నివాళులు అర్పించిన ప్రధాని మోదీ

జపాన్ పర్యటనకు ముందే మోదీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ షింజో అబే భారత్‭కు మంచి మిత్రుడని, ఆయన అంత్యక్రియలకు వెళ్తున్నానని పేర్కొన్నారు. ఇంకా ఆయన స్పందిస్తూ ‘‘జపాన్ విదేశాంగ విధానానికి ఆయన కొత్త రూపునిచ్చారు. అలాగే, భారత్‌-జపాన్‌ స్నేహ బంధం మరింత దృఢంగా మారడానికి కీలకపాత్ర పోషించారు. ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ ఇరు దేశాల మధ్య మైత్రి మరింత బలపడేలా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది’’ అని అన్నారు.

Modi at Japan: ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ మధ్యాహ్నం జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజో అబేకు వద్ద నివాళులు అర్పిస్తూ తుది వీడ్కోలు పలికారు. మంగళవారం ఉదయమే తాను జపాన్ చేరుకున్నానని ట్విట్టర్ ద్వారా మోదీ తెలిపారు. జూలై 8న ఓ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న షింజో అబేను దుండగులు కాల్చి చంపారు. కాగా, షింజో అబే అంత్యక్రియల్ని ఈ రోజు జపాన్ రాజధాని టోక్యోలో నిర్వహిస్తున్నారు. షింజో అబేకు తుది వీడ్కోలు పలకడానికి దాదాపు 20 దేశాల అధినేతలు టోక్యో వెళ్లారు. అంతేగాక, దాదాపు 100 దేశాల ప్రతినిధులు అబే అంత్య క్రియలకు హాజరవుతారు.

జపాన్ పర్యటనకు ముందే మోదీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ షింజో అబే భారత్‭కు మంచి మిత్రుడని, ఆయన అంత్యక్రియలకు వెళ్తున్నానని పేర్కొన్నారు. ఇంకా ఆయన స్పందిస్తూ ‘‘జపాన్ విదేశాంగ విధానానికి ఆయన కొత్త రూపునిచ్చారు. అలాగే, భారత్‌-జపాన్‌ స్నేహ బంధం మరింత దృఢంగా మారడానికి కీలకపాత్ర పోషించారు. ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ ఇరు దేశాల మధ్య మైత్రి మరింత బలపడేలా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది’’ అని అన్నారు. మోదీ జపాన్ పర్యటనలో భాగంగా ద్వైపాక్షిక అంశాలపై కూడా చర్చించనున్నారు.

ట్రెండింగ్ వార్తలు