బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ భర్త ప్రిన్స్ ఫిలిప్ (97) కు త్రుటిలో ప్రమాదం తప్పింది.
బ్రిటన్ మహారాణి ఎలిజబిత్-2 భర్త ప్రిన్స్ ఫిలిప్ (97) కు త్రుటిలో ప్రమాదం తప్పింది. జనవరి 17వతేదీ గురువారం ఫిలిప్ ప్రయాణిస్తున్న కారు శాండ్రిగమ్ ఎస్టేట్ దగ్గర ప్రమాదానికి గురైంది. పిలిప్ కారును మరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఫిలిప్ కారు బోల్తా పడి పల్టీలు కొట్టింది. గమనించిన స్థానికులు ఫిలిప్‌ను కారులో నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తూ ఫిలిప్ ప్రాణాలతో బయటపడ్డారు. రాయల్ ఫ్యామిలీ శాండ్రింగామ్ ఎస్టేట్ కు సమీపంలో కారు ప్రమాదం జరిగినట్టు బకింగ్ హామ్ ప్యాలెస్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
ప్యాలెస్ కు తిరిగొచ్చిన ఫిలిప్ ను వైద్యులు పరీక్షించగా.. ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని, క్షేమంగానే ఉన్నారని తెలిపారు. ఫిలిప్ కారు డ్రైవ్ చేస్తున్నారని, ఫిలిప్ తీవ్ర షాక్‌కి గురయ్యారని వెల్లడించారు. మరో కారులో ఉన్న ఇద్దరు మహిళలకు స్వల్ప గాయాలు కాగా, వీరికి క్యూన్ ఎలిజబెత్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.