Plane crash
Plane crash : అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. భారీ మంచు తుపాను వేళ ఓ ప్రైవేటు విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
Also Read : Hyderabad : అయ్యో.. కూకట్‌పల్లిలో విషాద ఘటన.. నాన్నా.. నాన్నా అంటూ అరిచేటప్పటికి.. ప్రాణాలు తీసిన చైనా మాంజ
మైన్‌లోని బాంగోర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్కడి కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 7.45 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఎనిమిది మందితో కూడిన బాంబార్డియర్ ఛాలెంజర్ 600 రకానికి చెందిన విమానం బాంగోర్ ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన క్షణాల వ్యవధిలోనే కూలిపోయింది. ఈ ప్రైవేట్ జెట్ హ్యూస్టన్ నుండి బాంగోర్ విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడి నుండి వెళ్లేందుకు టేకాఫ్ అయ్యే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.
టేకాఫ్ క్లియరెన్స్ ఇచ్చిన 45 సెకన్ల తరువాత విమానం తలకిందులుగా విమానాశ్రయంలోనే కుప్పకూలిపోయింది. వెంటనే పెద్దెత్తున మంటలు చెలరేగాయి. విమానం ప్రమాదం సమయంలో మంచు తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. అయితే, మృతి చెందిన వారు ఎవరు అనే వివరాలు తెలియాల్సి ఉంది. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం తరలించారు.
విమానం ప్రమాదం నేపథ్యంలో అధికారులు విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. విమాన ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు ఘటన స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టినట్లు మానాశ్రయ డైరెక్టర్ జోస్ సావేద్రా తెలిపారు. ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, నేషనల్ ట్రాన్స్ ఫోర్టేషన్ సేప్టీ బోర్డ్ దర్యాప్తు చేపట్టింది.