Hyderabad : అయ్యో.. కూకట్‌పల్లిలో విషాద ఘటన.. నాన్నా.. నాన్నా అంటూ అరిచేటప్పటికి.. ప్రాణాలు తీసిన చైనా మాంజ

Hyderabad : హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. చైనా మాంజ తగిలి ఐదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.

Hyderabad : అయ్యో.. కూకట్‌పల్లిలో విషాద ఘటన.. నాన్నా.. నాన్నా అంటూ అరిచేటప్పటికి.. ప్రాణాలు తీసిన చైనా మాంజ

china manja

Updated On : January 26, 2026 / 10:22 PM IST
  • కూకట్‌పల్లిలో విషాద ఘటన
  • చైనా మాంజా కారణంగా ఐదేళ్ల బాలిక మృతి
  • తండ్రితో కలిసి బైక్‌పై వెళ్తుండగా ఘటన
  • ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే కన్నుమూసిన చిన్నారి

Hyderabad : హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. చైనా మాంజ తగిలి ఐదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన సోమవారం సాయంత్రం వివేకానంద నగర్ సమీపంలో చోటు చేసుంది. పూర్తి వివరాల్లోకి వవెళితే.

Also Read : Google AI Mode : కొంపదీసి మీరు గూగుల్ AIని హెల్త్ టిప్స్ అడుగుతున్నారా?

కూకట్‌పల్లి నుంచి షాపింగ్ చేసుకొని ఐదేళ్ల చిన్నారి నిష్వికాదిత్య తన తండ్రితో కలిసి బైక్‌పై గోకుల్ ప్లాట్స్‌లోని తమ ఇంటికి వెళ్తుంది. బైక్‌పై వెళ్తున్న క్రమంలో చైనా మాంజా చిన్నారి మెడకు చుట్టుకొని తీవ్రంగా గాయపడింది. నాన్నా.. నాన్నా అంటూ అరిచేటప్పటికీ మెడ చుట్టూ తీవ్రగాయమైంది. తీవ్రంగా రక్తస్రావం అవుతుండటంతో ఆ బాలికను తండ్రి హుటాహుటీన ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆస్పత్రి సిబ్బంది చిన్నారిని పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు నిర్దారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కూకట్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కొంతమంది నిషేదిత చైనా మాంజాలతో పతంగులు ఎగురవేసి అమాయకుల ప్రాణాలు బలిగొనడం తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది. ఇటీవల ముగిసిన సంక్రాంతి పండుగ సమయంలో పతంగులు ఎగురవేసే సమయంలో చైనా మాంజాలు వినియోగించొద్దని పోలీసులు, అధికారులు విస్తృత ప్రచారం చేశారు. చైనా మాంజాను అమ్మినా, విక్రయించిన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అంతేకాదు.. దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలుచేస్తూ చైనా మాంజాల విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ప్రజల్లో సైతం విస్తృత అవగాహన కల్పించారు. కానీ, కొందరు చైనా మాంజాలతో పతంగులను ఎగువేయడం ద్వారా తాజాగా ఐదేళ్ల చిన్నారి ప్రాణాలను బలిగొన్నారు.