Russia Ukraine Conflict After Troop 'pullout', Putin Says Russia Does Not Want A War, But Attack Still Possible
Russian President Vladimir Putin: యుక్రెయిన్‌తో యుద్ధ వాతావరణం నెలకొంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జాతిని ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత ఈ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే యుక్రెయిన్‌తో తీవ్ర ఉద్రిక్తతల మధ్య రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
యుక్రెయిన్ తిరుగుబాటుదారులు ఆక్రమించిన రెండు ప్రావిన్సులను స్వతంత్ర దేశాలుగా గుర్తిస్తూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చట్టంపై సంతకం చేశారు. యుక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తుందన్న పాశ్చాత్య భయాల మధ్య రష్యా నిర్ణయం ఉద్రిక్తతలను పెంచుతుందని భావిస్తున్నారు.
అయితే, యుక్రెయిన్ వద్ద అణుబాంబు ఉందని.. కొన్నిదేశాల మద్దతుతో రష్యాపై యుక్రెయిన్ దాడిచేసే అవకాశం ఉందని పుతిన్ ఆరోపించారు. నాటో హెడ్‌క్వార్టర్స్ నుంచి యుక్రెయిన్‌కు ఆదేశాలు అందుతున్నాయని ఆరోపించారు.
రష్యా బలహీనపడాలని కోరుకుంటున్న అ్రగరాజ్యం అమెరికా.. యుక్రెయిన్‌ను పావుగా వాడుకుంటోందని అన్నారు. యుక్రెయిన్ రష్యా చరిత్రలో భాగమని అన్నారు పుతిన్. అయితే.. తమపై దాడికి దిగితే గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
అటు పుతిన్ తీరుపై యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆగ్రహం వ్యక్తంచేశారు. తిరుగుబాటుదారులను గుర్తించడమంటే శాంతి ఒప్పందాలను ఏకపక్షంగా ఉల్లంఘించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. పుతిన్ ప్రకటన తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత యుక్రెయిన్ జాతీయ భద్రతా రక్షణమండలి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
మరోవైపు పుతిన్ చర్యలను యూరోపియన్ యూనియన్, ఐక్యరాజ్యసమితి ఖండించాయి. యుక్రెయిన్‌లోని రెండు వేర్పాటువాద భూభాగాలను కలుపుకోవడానికిప్రయత్నిస్తే ఆంక్షలు తప్పవని 27దేశాల కూటమి యురోపియన్ యూనియన్ హెచ్చరించింది.
రష్యా చర్యలు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడంతో పాటు యుక్రెయిన్ సమ్రగతకు భంగం కలిగించడమేననన్నారు యురోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్‌డెర్ లేయన్.
యుక్రెయిన్ అమెరికా కీలుబొమ్మగా..
యుక్రెయిన్ అమెరికాకు కీలుబొమ్మగా మారిందని పుతిన్ ఆరోపించారు. “ఈ నిజమైన ప్రమాదాన్ని మేము విస్మరించలేము,” అని పుతిన్ అభిప్రాయపడ్డారు.