biden-putin
Vladimir Putin: యుక్రెయిన్‌లో యుద్ధం జరుగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ మండిపడ్డారు. యుక్రెయిన్‌కు సాయాన్ని కొనసాగించడంపై అమెరికా ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బిల్లును రిపబ్లికన్లు అడ్డుకోవడంతో బైడెన్ దీనిపై పలు వ్యాఖ్యలు చేశారు.
రష్యాతో జరుగుతోన్న యుద్ధంలో ఒకవేళ యుక్రెయిన్ ఓడిపోతే పుతిన్ తదుపరి టార్గెట్ నాటోలోని ఓ దేశమని బైడెన్ అన్నారు. అదే జరిగితే అమెరికా దళాలు కూడా ప్రత్యక్షంగా యుద్ధంలో పోరాడాల్సి వస్తుందని చెప్పారు. దీనిపైనే పుతిన్ ఇవాళ స్పందించారు.
బైడెన్ అర్థంలేని వ్యాఖ్యలు చేశారని పుతిన్ అన్నారు. ఈ విషయాన్ని బైడెన్ కూడా అర్థం చేసుకుంటారని భావిస్తున్నానని పుతిన్ వ్యాఖ్యానించారు. రష్యాపై అమెరికా తప్పుడు విధానాలను సరిచేసుకోవడంలో భాగంగా బైడెన్ ఇటువంటి వ్యాఖ్యలు చేశారన్నారు.
నాటోలోని దేశాలతో రష్యా యుద్ధం చేయదని స్పష్టం చేశారు. భౌగోళిక, ఆర్థిక, రాజకీయ, మిలటరీ పరంగా తమకు నాటోలోని దేశాలపై ఎలాంటి ఉద్దేశము, ఆసక్తి లేవని చెప్పారు.