Boris Johnson With Modi : పుతిన్ చర్యలతో ప్రపంచానికి పెను విపత్తు- మోదీతో బ్రిటన్ ప్రధాని

పుతిన్ తీసుకుంటున్న చర్యలతో ప్రపంచానికి పెను విపత్తు కలుగుతుందని వాపోయారు. యుక్రెయిన్ లో తీవ్రమైన యుద్ధ పరిస్థితుల గురించి..(Boris Johnson With Modi)

Boris Johnson With Modi : సైనిక చర్య పేరుతో యుక్రెయిన్ పై రష్యా ప్రారంభించిన యుద్ధం కొనసాగుతోంది. నాలుగు వారాలుగా యుక్రెయిన్ పై దాడులు కొనసాగుతున్నాయి. రష్యా సేనలు బాంబులు, మిస్సైళ్ల వర్షం కురిపిస్తున్నాయి. అంతర్జాతీయ సమాజం హెచ్చరించినా, కఠిన ఆంక్షలు విధించినా.. అనుకున్నది సాధించేవరకు తగ్గేదేలే అంటున్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. యుక్రెయిన్ తన దారికి రాకుంటే రసాయన, జీవాయుధాలు కూడా ప్రయోగించే యోచనలో పుతిన్ ఉన్నట్లు అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. రష్యా అధ్యక్షుడి తీరు యావత్ ప్రపంచాన్ని కలవరానికి గురి చేస్తోంది.

ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీకి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఫోన్ చేసి మాట్లాడారు. పుతిన్ తీసుకుంటున్న చర్యలతో ప్రపంచానికి పెను విపత్తు కలుగుతుందని ఆయన వాపోయారు. యుక్రెయిన్ లో ఉన్న తీవ్రమైన యుద్ధ పరిస్థితుల గురించి సుదీర్ఘంగా ప్రధాని మోదీతో బ్రిటన్ ప్రధాని చర్చించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి బ్రిటన్ ప్రధాని కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది.(Boris Johnson With Modi)

Russian Troops Killed : రష్యాకు బిగ్‌లాస్ .. 15,300 మంది సైనికులు మృతి-యుక్రెయిన్ ఆర్మీ వెల్లడి

యుక్రెయిన్ సమగ్రత, సార్వభౌమత్వాన్ని అందరూ కచ్చితంగా గౌరవించాల్సిందేనన్న అభిప్రాయాన్ని ఇద్దరు నేతలూ అంగీకరించినట్టు తెలిపింది. ఐక్యరాజ్యసమితి నిబంధనలకు రష్యా లోబడి ఉండాల్సిందేనని ఇరు నేతలు చెప్పారు. ప్రపంచ శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలంటే అంతర్జాతీయ చట్టాలను అందరూ ఆచరించాలని మోదీ, బోరిస్ లు అభిప్రాయపడ్డారు. మానవ సంక్షోభం దృష్ట్యా యుక్రెయిన్ కు అండగా ఉంటామంటూ ప్రధాని మోదీ మరోసారి హామీ ఇచ్చారు.

కాగా వాణిజ్యం, భద్రత, వ్యాపార రంగాల్లో బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేసేందుకు రెండు దేశాల నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారని, వీలైనంత త్వరగా ప్రత్యక్ష సమావేశం ఏర్పాటు చేసేందుకు కసరత్తులు చేస్తున్నారని బ్రిటన్ ప్రధాని కార్యాలయం తెలిపింది.

Biological Weapons On Ukraine : యుక్రెయిన్‌పై రష్యా రసాయన, జీవాయుధాలు ప్రయోగించొచ్చు-బైడెన్ సంచలన వ్యాఖ్యలు

అణ్వాయుధాల ప్రయోగం గురించి ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. రష్యా సంచలన ప్రకటన చేసింది. తమ దేశ ఉనికికి ముప్పు వాటిల్లితేనే అణ్వాయుధాల్ని ప్రయోగిస్తామని రష్యా స్పష్టం చేసింది. యుక్రెయిన్‌ తీవ్ర ప్రతిఘటన నేపథ్యంలో మాస్కో అణ్వాయుధాల్ని వినియోగిస్తుందంటూ వచ్చిన వార్తలు కలకలం రేపిన నేపథ్యంలో పుతిన్‌ సర్కార్ స్పందించింది. రష్యా మనుగడకు ముప్పు వాటిల్లితేనే అణ్వాయుధాల్ని ప్రయోగిస్తామని తేల్చి చెప్పింది.

యుక్రెయిన్‌పై ముప్పేట దాడికి రష్యా సేనలు ముందుకు కదులుతున్నాయి. మరియుపోల్‌ను స్వాధీనం చేసుకోవడానికి రష్యా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అజోవ్‌ సముద్రం నుంచి మరియుపోల్‌ తీర ప్రాంతం వైపు యుద్ధ నౌకలు వస్తున్నట్లు అమెరికా రక్షణ శాఖ అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు నల్ల సముద్రంలో మరో 21 యుద్ధ నౌకలను రష్యా సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించింది.

క్రిమియా నుంచి డాన్‌బాస్‌ ప్రాంతం మీదుగా పశ్చిమ రష్యాను కలిపే భూమార్గంలో మరియుపోల్‌ పోర్టు సిటీ కీలక మార్గంలో ఉంది. దీనిని ఆధీనంలోకి తీసుకోకుండా వ్యూహాత్మక లక్ష్యాలను సాధించే అవకాశం రష్యాకు లభించదు. ఈ నగరాన్ని స్వాధీనం చేసుకుంటే రణరంగంలో రష్యా అతిపెద్ద విజయం సాధించినట్లవుతుంది.

ట్రెండింగ్ వార్తలు